సీనియర్‌ నటుడు కార్తీక్‌ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు.  కార్తీక్‌ ఇటీవల ఉన్నట్టు అనారోగ్యానికి గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందారు. కొన్ని రోజుల చికిత్స అనంతరం ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఇటీవల ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు వెంటనే ఆయన్ను అడయార్‌లోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. కార్తీక్‌ శ్వాసకోస సంబంధిత సమస్యతో పాటు, అధిక రక్తపోటుకు గురైనట్లు వైద్యులు తెలిపారు. 

నటుడు కార్తీక్‌ ఆ మధ్య రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఏకంగా ఓ పార్టీని కూడా స్థాపించారు. కొంతకాలం తర్వాత రాజకీయాలకు దూరమైన ఆయన పార్టీని కూడా రద్దు చేశారు. ఇటీవల అన్నాడీఎంకే పార్టీకి మద్దతుగా ప్రచారం చేయనునట్లు ప్రకటించారు. అందులో భాగంగా ప్రచారం నిర్వహిస్తూ ఇలా కార్తీక్‌ అనారోగ్యానికి గురయ్యారు. సోమవారం సాయంత్రం ప్రచారం ముగించుకుని ఇంటికి చేరుకున్న కార్తీక్‌ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు.