పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓటమిపై నటుడు జెడి చక్రవర్తి తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. ఎక్కువగా పాలిటిక్స్ పై స్పందించకుండా కేవలం గెలుపోటములపై సున్నితంగా కామెంట్ చేశారు. హిప్పీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చిన జేడీ టాలీవుడ్ స్టార్ హీరోల గురించి మాట్లాడారు. 

ప్రతి హీరో గురించి సింగిల్ వర్డ్ లో క్యాప్షన్ ఇస్తూ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ పై చిన్న వివరణ ఇచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిచుంటే బావుండేదని అయన ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే మనిషని అన్నారు. అలాగే ఆయన ఎమోషనల్ గా ఉండే వ్యక్తి అంటూ నిజంగా గెలిచి ఉంటే హ్యాపీగా ఉండేదని చెప్పారు. 

ఇక జగన్ గెలిచినందుకు కూడా హ్యాపీగా ఉందని అయితే చంద్రబాబు ఓడిపోయారని నేను హ్యాపీ అనడం లేదు. జగన్ ని నమ్మి ప్రజలు ఓక అవకాశం ఇచ్చారు అది మంచి విషయం. చూద్దాం.. అంటూ ఇతర హీరోల గురించి కూడా మాట్లాడారు. మహేష్ పోకిరి లాంటి సినిమాలు చేస్తే నచ్చుతాడని సింగిల్ వర్డ్ లో కామెంట్ చేశారు.