సీనియర్ నటుడు గిరిబాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా వందలాది చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన తనయుడు రఘుబాబు కూడా టాలీవుడ్ లో నటుడిగా రాణిస్తున్నారు. ఇదిలా ఉండగా టిఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పలువురు సెలెబ్రిటీలు మొక్కలు నాటుతూ మరికొందరు ఈ కారక్రమంలో పాల్గొనేలా ఛాలెంజ్ చేస్తున్నారు. 

ఇప్పటికే పరుచూరి, శ్రీకాంత్ లాంటి సినీ ప్రముఖులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. తాజాగా గిరిబాబు కూడా మొక్కలు నాటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నటుడు కాదంబరి కిరణ్ ఇచ్చిన పిలుపు మేరకు గిరిబాబు మొక్కలు నాటారు. 

ఈ సందర్భంగా గిరిబాబు మాట్లాడుతూ మొక్కలను మనం నాటి వాటిని రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి అని తెలిపారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు అని. ఈ సందర్భంగా సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. మరో ముగ్గురు మొక్కలు నాటే విధంగా గిరిబాబు.. కమెడియన్ అలీ, తన కుమారుడు రఘుబాబు, మరో కమెడియన్ కృష్ణ భగవాన్ లకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేశారు. 

గిరిబాబు మొక్కలు నాటిన దృశ్యాలు నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. గిరిబాబు నటుడిగా వందలాది చిత్రాల్లో నటించారు. అలాగే దర్శకుడిగా కూడా పలు చిత్రాలని తెరకెక్కించారు. గిరిబాబు నెగిటివ్ షేడ్స్ లో నటించిన పాత్రలు ఆయనకు గుర్తింపు తీసుకువచ్చాయి.