చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ కి సంబంధించిన సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. చాలా మంది హీరోయిన్లు ఇప్పటికే కాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్ అయ్యారు. 

చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ కి సంబంధించిన సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. చాలా మంది హీరోయిన్లు ఇప్పటికే కాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్ అయ్యారు. తమకు జరిగిన చేదు అనుభవాలని పంచుకున్నారు. నటులపై, నిర్మాతలపై, దర్శకులపై చాలా మంది నటీమణులు కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 

కానీ కేరళలో సీన్ రివర్స్ అయింది. ఒక మహిళా డైరెక్టర్ నటుడిని తీవ్రమా వేధించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే కేరళకి చెందిన లక్ష్మి దీప్త ఇండస్ట్రీలో వెబ్ సిరీస్ లు, చిత్రాలు తెరకెక్కిస్తూ మహిళా డైరెక్టర్ గా గుర్తింపు సొంతం చేసుకుంటున్నారు. గత ఏడాది ఆమె ఒక వెబ్ సిరీస్ కూడా తెరకెక్కించారు. 

ప్రస్తుతం ఆమె ఓ వెబ్ సిరీస్ రూపొందింస్తున్నారు. ప్రస్తుతం వెబ్ సిరీస్ లు ఎలా ఉంటున్నాయో అందరికి తెలిసిందే. నటీమణుల ఎక్స్ పోజింగ్ హద్దులు దాటే విధంగా ఉంటోంది. అలాగే లిప్ లాక్స్, బెడ్ రూమ్ సీన్స్ ఎక్కువ అవుతున్నాయి. అయితే లక్ష్మి దీప్త తాను తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ లో ఓ సన్నివేశం మరీ శృతి మించే విధంగా అస్లీలంగా ఉందట. 

దీనితో ఆ సీన్ లో నటించేందుకు సదరు నటుడు నిరాకరించారు. కానీ లక్ష్మి దీప్త మాత్రం ఎలాగైనా ఆ సన్నివేశంలో నటించాల్సిందే అని ఎలాంటి మార్పులు ఉండవని వేధిస్తోందట. ఆమె వేధింపులు ఎక్కువ అవుతుండటంతో నటుడు కోర్టుని ఆశ్రయించాడు. దీనితో కోర్టు వెంటనే లక్ష్మి దీప్తని అరెస్ట్ చేయాలని కేరళ పోలీసులని ఆదేశించింది. పోలీసులు ఆమెని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే లక్ష్మి దీప్త ఎలాగో బెయిల్ తెచ్చుకుని విడుదల అయింది. వారానికి రెండు రోజుల చొప్పున 6 వారాల పాటు లక్ష్మి దీప్త విచారణకి హాజరు కావాల్సిందే అని కోర్టు ఆదేశించినట్లు తెలుస్తోంది. నటీమణులకు వేధింపులు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం పరిస్థితి విచిత్రంగా ఉంది అని నెటిజన్లు అంటున్నారు.