లెజెండరీ నటుడు దిలీప్‌ కుమార్‌(98) ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్నారు. శుక్రవారం ఆయన్ని డిశ్చార్చ్ చేస్తున్నట్టు వైద్యులు, కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం దిలీప్‌ కుమార్ ముంబయిలోని పీడీ హిందుజ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత వారం క్రితం దిలీప్‌ కుమార్‌ అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో వెంటనే ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించారు. ఆ విషయాన్ని దిలీప్‌ కుమార్‌ మేనేజర్‌ తెలిపారు.

దాదాపు వారం రోజుల ట్రీట్‌మెంట్‌ అనంతరం శుక్రవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తున్నట్టు తెలిపారు. ఆయనకు డాక్టర్ జలిల్‌ పర్కర్‌ ఆధ్వర్యంలో ట్రీట్‌మెంట్‌ జరిగింది. ఒకప్పుడు బాలీవుడ్‌లో ఏలిన లెజెండరీ నటుడు దిలీప్‌ కుమార్. అనేక అవార్డులు సొంతం చేసుకున్నారు. వయోభారం రీత్యా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.