బాలీవుడ్ బుల్లితెర నటుడి ఇంట్లో తీరని విషాదం చోటుచేసుకుంది. నవ్వుతు ఆడుకుంటున్న చిన్నారి కనురెప్ప పాటున కనుమూసింది. చూస్తుండగానే అందరిముందు కళ్ళు మూసిన ఆ చిన్నారి మరణం బాలీవుడ్ లో అందరిని షాక్ కి గురిచేసింది. 

అసలు వివరాల్లోకి వెళితే.. ప్రముఖ టీవీ నటుడు ప్రతీష్‌ వోరా కూతురు ఒక చిన్న బొమ్మతో సరదాగా ఆడుకుంటూ ఉండగా కొన్ని నిమిషాలకే ఊపిరాడక మరణించింది. ఒక చిన్న ప్లాస్టిక్ బొమ్మను పాప నోట్లో పెట్టుకోవడంతో గొంతులో ఇరికింది. ఎవరు చూడకపోవడంతో చిన్నారి ఊపిరాడక ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే మరణించింది. 

ప్రస్తుతం ప్రతీష్ ‘ప్యార్ కే పాపడ్’ అనే టీవీ (స్టార్‌ భారత్‌) షోతో బిజీగా ఉన్నాడు. ఘటన గురించి తెలియగానే షాకైన అతను ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. ఆయనను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు,.కొంత మంది టివి నటీనటులు ప్రతిష్ కూతురిని ఆఖరి సారి చూసేందుకు వారి ఇంటికి చేరుకున్నారు.