ప్రముఖ కన్నడ నటుడు చేతన్ చంద్రపై ఏమాత్రం ఊహించని విధంగా దాడి జరిగింది. ఈ ఘటనలో దుండగులు చేతన్ ని రక్తం వచ్చేలా గాయపరిచారు. గుడికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రముఖ కన్నడ నటుడు చేతన్ చంద్రపై ఏమాత్రం ఊహించని విధంగా దాడి జరిగింది. ఈ ఘటనలో దుండగులు చేతన్ ని రక్తం వచ్చేలా గాయపరిచారు. గుడికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై చేతన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

వివరాల్లోకి వెళితే కన్నడ నటుడిగా చేతన్ చంద్ర రాణిస్తున్నారు. ఆదివారం రోజు మదర్స్ డే కావడంతో చేతన్ తన తల్లిని తీసుకుని గుడికి వెళ్ళాడు. బెంగుళూరులోని కల్గిపురలో ఓ గుడిని సందర్శించి తిరిగి వేస్తుండగా ఈ సంఘటన జరిగింది. మద్యం సేవించిన ఓ వ్యక్తి చేతన్ కారుని ఫాలో అయ్యాడు. కాసేపటికి కారుని డ్యామేజ్ చేశాడు. 

ఇదేంటని చేతన్ ప్రశ్నించగా అతడిపై దాడికి దిగాడు. వెంటనే అతడి గ్యాంగ్ మరో 20 మంది అక్కడికి చేరుకొని చేతన్ ని తీవ్రంగా గాయపరిచారు. ముక్కుకి గాయం అయింది. చేతన్ రక్తం వచ్చేలా గాయపడ్డాడు. చేతన్ పై దాడికి దిగిన వారిలో ఓ మహిళ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 

View post on Instagram

దీనితో చేతన్ పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాదు. సోషల్ మీడియాలో సైతం తనకి న్యాయం కావాలి అంటూ పోస్ట్ చేశాడు. తనకి న్యాయం కావాలని కోరాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం వెతుకుతున్నారు.