నటించాలని ఉన్నా..వారికోసం సినిమాలు మానేసిన చంద్రమోహన్.. కారణమేంటంటే..?
దాదాపు 1000 సినిమాల వరకూ నటించారు చంద్రమోహాన్.. ఊపిరి ఉన్నంత వరకూ నటించాలి అని అనుకున్నారు. కాని ఆయన సడెన్ గా నటన ఆపేయాల్సి వచ్చిందట దానికి కారణం ఏంటీ..?

చంద్రమోహన్ మరణంతో ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 82 ఏళ్ల వయస్సులో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు చంద్రమోహాన్. దాదాపు గా 55 ఏళ్ల సినిమా కెరీర్ లో 1000 సినిమాల వరకూ చేశారు చంద్రమోహాన్. విలన్ గా, హీరోగా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా .. తండ్రిగా, అన్నగా.. తాతగా.. ఇలా ఆయన చేయని పాత్రంటూ లేదు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నటుడు చంద్రమోహాన్. ఎంతో మంది హీరోయిన్లకు లైఫ్ ఇచ్చిన లక్కీ హ్యాండ్ చంద్రమోహాన్.
అయితే చంద్రమోహన్ కు నటన అంటేప్రాణం.. ఆయన ఊపిరి ఉన్నంత వరకూ నటించాలని పరితపించారుచంద్రమోహాన్. ఎంత వయస్సు వచ్చినా.. పాత్రలు వస్తే.. వీల్ చైర్ లో అయినా కూర్చోని నటిస్తాను అనేవారట చంద్రమోహాన్. కాని ఆయన సడెన్ గా సినిమాలు మానేయాల్సి వచ్చింది. ఇంటికే పరిమితం అవ్వాల్సి వచ్చింది. కారణం ఏంటంటే..? చంద్రమోహన్ అనారోగ్యం. అనారోగ్యంతో ఉన్న కూడా నటించాలని ఆయనకు కోరిక. కాని తన వల్ల షూటింగ్ టీమ్ ఇబ్బందులు పడుతుందన్న కారణంగా చంద్రమోహన్ నటన ఆపేయాల్సి వచ్చిందట. ఈ విషయం గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు ఆయన.
అప్పుడు జరిగిన ఇంటర్వ్యూలో ఆయన చాలా విషయాలు వెల్లడించారు.. ఈ సందర్భంగా తన సినీ ప్రయాణం గురించి మాట్లాడుతూ... ఈ సినీ జీవితం చాలా పాఠాలు నేర్పించింది. ఇక్కడ పేరు, డబ్బు, బంధాలు.. ఏవీ శాశ్వతం కాదని, ఆర్థికంగా జాగ్రత్తగా ఉండకపోతే చాలా ప్రమాదమని నేర్పింది. చిత్రసీమ వేలాదిమందికి ఉపాధి కల్పించినంత కాలం, నిర్మాతలు చల్లగా ఉన్నంత కాలం ఏ ట్రెండైనా పర్వాలేదు. కరోనా మాత్రం
సినిమా ఇండస్ట్రీకి ఉపాధి లేకుండా చేసింది అన్నారు.
అంతే కాదు.. 50ఏళ్లలో నా ఆరోగ్యాన్ని చాలా నిర్లక్ష్యం చేశా. అదే నన్ను చాలా కుంగదీసింది. లేకుంటే ఇంకా చాలా కాలం నటించే అవకాశం వచ్చేది అనన్నారు. తన అనారోగ్యం సినిమా టీమ్ కు ఇబ్బంది కాకూడదు అనే నటన మానేశానన్నారు చంద్రమోహన్. 'రాఖీ'లో ఎమోషనల్సీన్ చేసి వచ్చి.. బైపాస్ సర్జరీ కోసం నేరుగా ఆస్పత్రిలో చేరా. 'దువ్వాడ జగన్నాథమ్' షూటింగ్ టైమ్ లో సిక్ అవ్వడం వల్ల షూట్ వాయిదా వేయాల్సి వచ్చింది. నా వల్ల నిర్మాతలు ఇబ్బందిలో పడటం నాకిష్టం లేదు. అందుకే నటనకు రిటైర్మెంట్ ప్రకటించాను అని అప్పట్లో చెప్పారుచంద్రమోహన్.
టీవీ, యూట్యూబ్ల ద్వారా నా చిత్రాలు ఇప్పటికీ ప్రేక్షకులకుఅందుబాటులోనే ఉంటున్నాయి. వాటిని చూసే అభిమానులు ఎక్కువయ్యారు. ఈ జన్మకి ఇది చాలు అన్నారు. సినిమాల తో పాటు చంద్రమోహన్.. పలుటీవీ కార్యక్రమాలు కూడా చేశారు. యాడ్స్ ద్వారా కూడా చాలా సంపాధించారు.. ఇక ఆయన మరణంతో ఇండస్ట్రీలోని ప్రముఖులు వరుసగా సంతాపాలుప్రకటిస్తున్నారు.