‘30 వెడ్స్ 21’ సిరీస్ తో పాపులర్ అయిన నటుడు చైతన్య రావు (Chaitanya Rao) నుంచి సరికొత్త కథతో సినిమా రాబోతోంది. తాజాగా ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటోంది. 

‘30 వెడ్స్ 21’ సిరీస్ తో నటుడు చైతన్య రావు పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి లీడ్ రోల్ లో వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాయి. తాజాగా చైత‌న్య రావు, భూమి శెట్టి జంట‌గా న‌టించిన ‘ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి’ (Sharathulu Varthisthai) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి కుమార‌స్వామి(అక్ష‌ర‌) ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. స్టార్ లైట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నాగార్జున సామ‌ల‌, శ్రీష్ కుమార్ గుండా, డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ చిత్త‌జ‌ల్లు నిర్మించారు. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వాళ్ల జీవితాల్లో ఉండే సంతోషాలు, బాధలు, అన్ని ఎమోషన్స్ ఈ కథలో ఉంటాయని ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. 

ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా నటుడు సంతోష్ యాదవ్, నిర్మాత డాక్టర్ కృష్ణకాంత్ చిత్తజల్లు, దర్శకుడు కుమారస్వామి, హీరోయిన్ భూమి శెట్టి, హీరో చైతన్య రావ్ సినిమా గురించి మాట్లాడారు. ‘ష‌ర‌తులు వ‌ర్తిసాయి’ ట్రైలర్ ఆడియెన్స్ కు నచ్చిందని ఆశిస్తున్నామన్నారు. మన మధ్య జరుగుతున్న కథలా ఉంటుంది. పూర్తిగా కమర్షియల్ సినిమా ట్రెండ్ నడుస్తున్న ఈ టైమ్ లో ఒక మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీని తీసుకొస్తున్నామన్నారు. ప్రేక్షకాదరణ దక్కుతుందని ఆశిస్తున్నామన్నారు.