Asianet News TeluguAsianet News Telugu

మెగా ఫ్యామిలీని అంటే హర్ట్ అవరా... రోజాకు నటుడు బ్రహ్మాజీ కౌంటర్! 


మెగా ఫ్యామిలీని ఉద్దేశిస్తూ మంత్రి రోజా చేసిన కామెంట్స్ కి బ్రహ్మాజీ కౌంటర్ ఇచ్చారు. రోజా మాట్లాడిన వీడియో లింక్ చేసి ఆసక్తికర కామెంట్ పోస్ట్ చేశాడు. 
 

actor brahmaji counter to minister roja for comments against mega family
Author
First Published Jan 20, 2023, 9:56 AM IST

మెగా ఫ్యామిలీ దెబ్బకు సినిమాలు రాజకీయాలు ఏకమైపోయాయి. సినిమా వేదికలపై రాజకీయ ప్రసంగాలు, చిత్రాల్లో ప్రభుత్వాలను విమర్శిస్తూ డైలాగ్స్ ఎక్కువైపోయాయి. చిరంజీవి, పవన్ సానుభూతిపరులు వారిపై వచ్చే రాజకీయ ఆరోపణలను తీసుకోలేకపోతున్నారు. వెంటనే రియాక్ట్ అవుతున్నారు. తాజాగా నటుడు బ్రహ్మాజీ మంత్రి రోజా ఆరోపణలపై స్పందించారు. ఆమెకు కౌంటర్ ఇచ్చారు. ఇటీవల జరిగిన యువశక్తి సభలో హైపర్ ఆది మాట్లాడాడు. ఆయన వైసీపీ ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పేల్చారు. ఫక్తు రాజకీయ నాయకుడు మాదిరి ప్రసంగించారు. 

జబర్దస్త్ కమెడియన్ గా రోజాతో అతనికి అనుబంధం ఉంది. ఏళ్ల తరబడి ఆమె జడ్జిగా ఆది కమెడియన్ గా పనిచేశారు. ఈ క్రమంలో రోజాను హైపర్ ఆది కామెంట్స్ పై స్పందించాలని అడిగారు. చిన్న చిన్న ఆర్టిస్ట్స్ మెగా ఫ్యామిలీకి భయపడి ఇలాంటి చర్యలకు పాల్పడతారు. మెగా ఫ్యామిలీలో చాలా మంది హీరోలు ఉన్నారు. వారిని వ్యతిరేకిస్తే కెరీర్ ఉండదని భావిస్తారు. పరిశ్రమలో ఎవరికీ మెగా ఫ్యామిలీ మీద ప్రేమ ఉండదు. కేవలం భయంతో భజన చేస్తారు. 

నిజంగా ప్రేమ ఉంటే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో వారు సపోర్ట్ చేసిన ప్రకాష్ రాజ్ గెలవాలి కదా. కాబట్టి ఏదో కెరీర్ కోసం చిన్న ఆర్టిస్టులు మాపై చేసే కామెంట్స్ ని నేను పట్టించుకోనని.. వివరణ ఇచ్చారు. ఈ మాటలను పరోక్షంగా బ్రహ్మాజీ ఖండించారు. 'నన్నెప్పుడూ మెగా ఫ్యామిలీ క్యాంపైన్ చేయమని కానీ పార్టీలో చేరమని కానీ అడగలేదు. చిన్న ఆర్టిస్టులే కదా... అంత భయపడతారెందుకు' అని రోజా మాట్లాడిన వీడియో ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు. 

మెగా ఫ్యామిలీకి మద్దతుగా ఏం మాట్లాడినా అది ప్రేమతో చేసేదే. వారు మమ్మల్ని భయపెట్టరు. చిన్న ఆర్టిస్ట్స్ అంటూనే భయపడతారెందుకు... అని బ్రహ్మాజీ కౌంటర్ ఇచ్చాడు.  ఏపీ గవర్నమెంట్ వర్సెస్ టాలీవుడ్ అన్నట్లు పరిస్థితులు మారాయి. చిత్ర పరిశ్రమలో సగం టీడీపీ, సగం జనసేన అభిమానులు ఉన్నారు. వీరందరి కామన్ ఎనిమీగా వైఎస్ జగన్ ఉన్నాడు. 2024 ఎన్నికల్లో చిత్ర పరిశ్రమకు చెందిన చాలా మంది నటులు రాజకీయ రంగులు పులుముకోవడం ఖాయం. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వైసీపీకి వ్యతిరేకంగా పనిచేయడం అనివార్యం. ఎలాగైనా సీఎం పదవి నుండి వైస్ జగన్ ని దించేయాలన్న పరిశ్రమ వర్గాల ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios