Asianet News TeluguAsianet News Telugu

యానిమల్ పై విమర్శలు... బాబీ డియోల్ నుండి ఉహించని సమాధానం!


యానిమల్ మూవీ ఎంత విజయం సాధించిందో అంతకు మించిన కాంట్రవర్సీ ఫేస్ చేస్తుంది. ఈ సినిమాలో అత్యాచార సన్నివేశం మీద విపరీతమైన విమర్శలు వినిపించాయి. ఈ క్రమంలో బాబీ డియోల్ స్పందించారు. 
 

actor boby deol responds criticism on animal movie ksr
Author
First Published Dec 14, 2023, 7:08 PM IST

యానిమల్ అంచనాలకు మించిన విజయం సాధించింది. 13 రోజులకు యానిమల్ వరల్డ్ వైడ్ రూ. 772.33 కోట్ల వసూళ్లు రాబట్టింది. సక్సెస్ కి మించిన కాంట్రవర్సీ ఈ సినిమా ఫేస్ చేస్తుంది. చిత్ర ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు యానిమల్ కి వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు. హింస, అత్యాచారాలు, పురుషాధిక్యత వంటి చెడు విషయాలను ప్రోత్సహించేదిగా మూవీ ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

విలన్ రోల్ చేసిన బాబీ డియోల్ ని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఆయన ఓ సన్నివేశంలో పెళ్లి కూతురిని రేప్ చేస్తాడు. అలాగే తన ఇద్దరు భార్యలు బెడ్ రూమ్ కి రావాలన్నట్లు సైగలు చేస్తాడు. ఈ సీన్ వైవాహిక అత్యాచారాన్ని ప్రోత్సహించేదిగా ఉందని సోషలిస్ట్స్ ఖండిస్తున్నారు. విమర్శల నేపథ్యంలో నటుడు బాబీ డియోల్ స్పందించారు. ఆయన కీలక కామెంట్స్ చేశారు. 

ఆ రేప్ సీన్ వల్లే యానిమల్ ఇంత పెద్ద విజయం సాధించింది. పాత్ర డిమాండ్ మేరకే నేను ఆ సన్నివేశంలో నటించాను. సమాజంలో జరిగే సంఘటనలే సినిమాల్లో చూపిస్తారు. సినిమాల ద్వారా చెడును ప్రోమోట్ చేయడం లేదు. తక్కువ నిడివి కలిగిన నా పాత్ర తీరు చెప్పేందుకు రేప్ సీన్ రూపొందించారు. వాస్తవంగా నేను కూడా ఇలాంటి విషయాలను ఎంకరేజ్ చేయను, అన్నారు. 

బాబీ డియోల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రన్బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ చిత్రానికి సందీప్ రెడ్డి వంగ దర్శకుడు. రష్మిక మందాన హీరోయిన్ గా నటించింది. అనిల్ కపూర్ కీలక రోల్ చేశారు. సందీప్ రెడ్డి వంగ యానిమల్ తో హ్యాట్రిక్ పూర్తి చేశాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సైతం భారీ విజయాలు సాధించాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios