గత కొన్నేళ్లుగా చిత్ర పరిశ్రమలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. సినీ రాజకీయ క్రీడా రంగాలకు చెందిన లెజెండ్స్ జీవిత చరిత్రలని వెండితెరపై ఆవిష్కరించేందుకు ఫిలిం మేకర్స్ ఆసక్తి చూపుతున్నారు.
గత కొన్నేళ్లుగా చిత్ర పరిశ్రమలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. సినీ రాజకీయ క్రీడా రంగాలకు చెందిన లెజెండ్స్ జీవిత చరిత్రలని వెండితెరపై ఆవిష్కరించేందుకు ఫిలిం మేకర్స్ ఆసక్తి చూపుతున్నారు. టాలీవుడ్ సీనియర్ ఆర్టిస్ట్ బెనర్జీ తాజాగా మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
చిరంజీవి బయోపిక్ గురించి తాను చేసిన కామెంట్స్ ని కొందరు వక్రీకరించారు అని బెనర్జీ అన్నారు. మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ తాను చేస్తానని వస్తున్న వార్తలు అవాస్తవం అని అన్నారు. ఒక వేదికపై మాట్లాడుతూ.. చిరంజీవి గురించి మాట్లాడే అవకాశం వచ్చింది. ఆయన ఎంతో కష్టపడి ఎదిగారు. అలాంటి వ్యక్తి బయోపిక్ వస్తే ప్రస్తుతం ఉన్న నటులకు ఆదర్శవంతంగా ఉంటుంది.
కష్ఠాలు ఎదుర్కొంటూ.. ఒక్కో మెట్టు ఎదుగుతూ ఈ స్థాయికి చేరుకున్న చిరంజీవి గారి బయోపిక్ తెరకెక్కిస్తే అద్భుతంగా ఉంటుందని చెప్పాను. నేను చేసిన కామెంట్స్ ని కొందరు తప్పుగా రాశారు. చిరంజీవి బయోపిక్ నేనే చేస్తున్నాను అంటూ అవాస్తవాలు ప్రచారం చేశారు. చిరంజీవి బయోపిక్ వస్తే బావుంటుందని చెప్పాను కానీ.. అది నేనే చేస్తాను అని చెప్పలేదు అని బెనర్జీ క్లారిటీ ఇచ్చారు.
చిరంజీవితో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన గ్రేట్ హ్యూమన్ బీయింగ్. కరోనా సమయంలో చిత్ర పరిశ్రమలోని 24 శాఖల వారికి మాత్రమే కాదు.. బయటి వ్యక్తులకు కూడా చిరంజీవి ఆర్థిక సాయం చేసారు అని బెనర్జీ తెలిపారు. గతంలో చిరంజీవి కూడా తన బయోపిక్ పై స్పందించారు. తమ ఫ్యామిలిలో సాయిధరమ్ తేజ్ కి తన పోలికలు ఎక్కువగా ఉన్నాయని.. తేజు నా పాత్రలో బాగా సరిపోతాడని చిరు తెలిపారు.
