Asianet News TeluguAsianet News Telugu

అజయ్‌ హీరోగా మరో ప్రయోగం.. `చక్రవ్యూహం`లో చిక్కుకునేదెవరు?

 అజయ్‌. బలమైన పాత్రలతో మెప్పిస్తుంది. ముఖ్యంగా విలన్‌గా ఆయన మంచి పేరుతెచ్చుకున్నారు. అయితే అజయ్‌ హీరోగానూ ప్రయోగం చేశాడు.

actor ajay turn once again as main lead in chakravyuham movie
Author
First Published Jan 2, 2023, 7:38 PM IST

విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణిస్తున్న అజయ్‌. బలమైన పాత్రలతో మెప్పిస్తుంది. ముఖ్యంగా విలన్‌గా ఆయన మంచి పేరుతెచ్చుకున్నారు. అయితే అజయ్‌ హీరోగానూ ప్రయోగం చేశాడు. `సారాయి వీర్రాజు` పేరుతో ఓ సినిమా కూడా చేశాడు. ఆ తర్వాత ఒకటి రెండు మూవీలో మెయిన్‌ రోల్‌ చేశారు. అయితే కమర్షియల్‌గా ఆశించిన రిజల్ట్ రాలేదు. చాలా గ్యాప్‌ తర్వాత ఇప్పుడు ఆయన మెయిన్‌ రోల్‌తో సినిమా రాబోతుంది. `చక్రవ్యూహం` పేరుతో సినిమా తెరకెక్కుతుంది. 

సహస్ర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత శ్రీమతి.సావిత్రి నిర్మిస్తున్న చిత్రం "చక్రవ్యూహం" (ది ట్రాప్). ఇందులో నటుడు అజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమాకి చెట్కూరి మధుసూధన్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని, తెలుగు సినిమా స్థాయిని పెంచారు స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ  గారు. తెలుగు తెరపై ఆయనే తొలి కౌబోయ్, ఆయనే మొదటి జేమ్స్ బాండ్, ఆయనే ఫస్ట్ సినిమా స్కోప్ హీరో, ఆయనే ప్రథమ 70 ఎం. ఎం. మూవీ డైరెక్టర్ కమ్ హీరో… చిత్రసీమలో డేరింగ్ డాషింగ్ అనే పదాలకు నిలువెత్తు నిర్వచనంగా మారి, తెలుగు చిత్రపరిశ్రమకు ఒక సరికొత్త టెక్నలాజినీ పరిచయం చేసిన స్వర్గీయ శ్రీ సూపర్ స్టార్ కృష్ణ గారు చివరగా ఈ సినిమా పోస్టర్ ను లాంచ్ చేసారు.

ఈ పోస్టర్ ను లాంచ్ చేసిన కృష్ణ గారు ఈ చిత్ర బృందానికి ఆశీస్సులు అందించారు.  ఈ లాంచ్ చేసిన పోస్టర్ లో పోలీస్ పాత్రలో ఇంటెన్స్ లుక్ తో కనిపిస్తున్న అజయ్ ను మనం గమనించవచ్చు. ఈ సినిమా మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ గా ఉండబోతున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. చెట్కూరి మధుసూధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీమతి సావిత్రి నిర్మాతగా, వెంకటేష్, అనూష సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకి భరత్ మంచిరాజు సంగీతం అందిస్తున్నారు. త్వరలో సినిమాకి సంబంధించిన అప్‌డేట్లు వెల్లడించనున్నట్టు తెలిసింది యూనిట్‌. మరి అజయ్‌ ఈ సారైనా హీరోగా మెప్పిస్తాడా? అనేది చూడాలి. 

సాంకేతిక సిబ్బంది:
రచన మరియు దర్శకత్వం: చెట్కూరి మధుసూధన్
నిర్మాత: శ్రీమతి.సావిత్రి
సహ నిర్మాతలు: వెంకటేష్, అనూష
బ్యానర్: సహస్ర క్రియేషన్స్
సంగీత దర్శకుడు: భరత్ మంచిరాజు
సినిమాటోగ్రఫీ: జివి అజయ్
ఎడిటర్: జెస్విన్ ప్రభు
ఫైట్స్: రాబిన్ సుబ్బు
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: అజయ్, మహేష్
కలరిస్ట్: షణ్ముఘ పాండియన్
పి.ఆర్.ఓ: మేఘా శ్యామ్
డిజిటల్ మీడియా: ప్రసాద్, ధీరజ్

Follow Us:
Download App:
  • android
  • ios