విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అజయ్ దూసుకుపోతున్నాడు. పలు చిత్రాల్లో విలన్ గా అజయ్ నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దిగ్గజ నటుడు కోటా శ్రీనివాసరావు సైతం అజయ్ నటనని ప్రశంసించారు. అజయ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు తెలియజేశాడు. తాను నటించిన తొలి చిత్రం కౌరవుడు అని అజయ్ తెలిపాడు. నటుడిగా నాకు గుర్తింపు పెరిగేలా చేసిన చిత్రం ఖుషి అని అజయ్ తెలిపాడు. 

ఖుషి చిత్రంలో స్టూడెంట్ పాత్రలో కనిపించాను. ఆ పాత్ర కోసం నన్ను ఎంపిక చేసింది పవన్ కళ్యాణ్ గారే అని అజయ్ తెలిపాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో సాధారణమైన పాత్రలు వచ్చాయి. అలాంటి పరిస్థితుల్లో విక్రమార్కుడు చిత్రం నా కెరీర్ నే మార్చేసింది. రాజమౌళి గారు నాకు విలన్ గా అవకాశం ఇచ్చారు. విక్రమార్కుడులో చేసిన విలన్ పాత్ర భవిష్యత్తులో చేయలేనేమో. ఆ సినిమా నాకు అంత ప్రత్యేకమైనది. ఆ క్రెడిట్ మొత్తం రాజమౌళిగారిదే అని అజయ్ తెలిపాడు. 

అతడు, గబ్బర్ సింగ్, జనతా గ్యారేజ్, అ..ఆ, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి చిత్రాల్లో అజయ్ కీలక పాత్రల్లో నటించాడు. ప్రస్తుతం అజయ్ కు విలన్ గా భారీ చిత్రాల్లో అవకాశాలు దక్కుతున్నాయి.