మంచు విష్ణు మామూలోడు కాదు.. ఆ యూట్యూబ్ ఛానల్స్ ను ఏం చేశాడో తెలుసా..?

మంచు విష్ణు అన్నంత పని చేశాడు.. ఇన్నాళ్ళు ఒక లెక్క ఇప్పుడు ఓలెక్క.. ఇక సహించేది లేదు అని ఫిక్స్ అయినట్టు ఉన్నాడు. మంచు హీరో యాక్షన్ లోకి దిగాడు. ఇంతకీ ఏం చేశాడో తెలుసా..? 

Action Against YouTube Channels: Manchu Vishnus Bold Move JMS

సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్ ఫేస్ చేస్తున్న ఫ్యామిలీ ఎవరైనా ఉన్నారంటే అది మంచు ఫ్యామిలీ మాత్రమే. ఈ కుటుంబం నుంచి మోహాన్ బాబుతో పాటు.. మంచు విష్ణు, మంచు లక్ష్మి కూడా ట్రోలింగ్ ఫేస్ చేస్తుంటారు. మనోజ్ మాత్రమే కాస్త సేఫ్ జోన్ లో ఉంటాడు. అయితే వీరిపై చాలా సార్లు ఏదో చేయాలి అనుకుని.. బెదిరించి..ట్రోలింగ్స్ ను ఆపలేక పోయారు...పైగా ఇలా చేసి.. ఇంకాస్త ట్రోలింగ్ కు గురయ్యారు మంచు ఫ్యామిలీ. అయితే ఈసారిమాత్రం పక్కా ప్లాన్ తో దెబ్బ కొట్టడానికి రెడీ అయ్యాడు విష్ణు. తాము కూడా బాధితులమే అని చెపుతూ.. ప్రస్తుతం నడుస్తున్న సోషల్ మీడియా ఇష్యూస్ ను తీసుకుని.. యాక్షన్ ప్లాన్ ను సెట్ చేసుకున్నాడు. యూట్యూబ్ ఛానల్స్ పై యాక్షన్ కు రంగంలోకి దిగాడు. 

మహేష్ బాబు మిస్సయ్యాడు..రామ్ పోతినేని బుక్కయ్యాడు.. భారీ డిజాస్టర్ నుంచి తప్పించుకున్న సూపర్ స్టార్..

నెట్టిట  చిన్న పిల్ల‌లు, హీరో హీరోయిన్లపై ఫన్నీ మీమ్స్ పేరుతో  ట్రోలింగ్ చేస్తూన్న తెలుగు యూట్యూబ‌ర్‌లకు మంచు విష్ణు ఈమధ్యే గట్టిగా  వార్నింగ్ ఇచ్చాడు. బాగా ఫేమస్ నటీనటులను ట్రోల్ చేస్తూ... ఇష్టం వచ్చినట్టు విమర్షలు చేస్తూ వస్తున్న యూట్యూబ్ ఛానెల్స్ కు.. గట్టిగా వర్నింగ్ ఇచ్చారు.  ఆవీడియోలను వీడియోలను, కామెంట్లను 48గంటల్లో తొలగించాలని లేక‌పోతే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయని మంచు విష్ణు యూట్యూబ్ వేదికగా హెచ్చ‌రించాడు. అయితే చెప్పిన‌ట్లుగానే 48 గంటల అనంత‌రం సినీ న‌టులు, వారి కుటుంబ స‌భ్యుల ప‌ట్ల అభ్యంత‌రక‌ర కంటెంట్‌ను పోస్ట్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్‌పై యాక్షన్ తీసుకున్నారు మా టీమ్. ఈ విషయాన్ని అసోసియేష‌న్ ఎక్స్ ద్వారా వెల్ల‌డించింది.

అల్లు అర్జున్ కు కలిసొచ్చిన రెండు సెంటిమెంట్లు.. బన్నీ ఖచ్చితంగా ఫాలో అయ్యేవి ఇవే....?

సోషల్ మీడియాలో చిన్న పిల్ల‌లు, హీరో హీరోయిన్లపై డార్క్ కామెడీ పేరుతో ట్రోలింగ్ చేస్తున్న 5 యూట్యూబ్ ఛాన‌ల్స్‌ను టర్మినేట్ చేయించిన‌ట్లు మా అసోషియేషన్ ప్రకటించింది. ఆ  5 యూట్యూబ్ ఛాన‌ల్స్  పేర్లను  సోషల్ మీడియాలో వెల్లడిచారు. జ‌స్ట్ వాచ్ బీబీసీ, ట్రోల్స్ రాజా, బ‌చ్చిన్ ల‌లిత్, హైద‌రాబాద్ కుర్రాడు ఇలా 5 ఛానెల్స్ ను అధికారుల సాయంతో తోల‌గించారు. 

 

అంతే కాదు  ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలుపుతూ.. ఇది కేవ‌లం ఆరంభం మాత్ర‌మే.. ఇంకా మారకుంటే.. అసలుసినిమా ముందుంటుంది అంటూ.. మిగిలిన  యూట్యూబ‌ర్స్‌కు కూడా హెచ్చ‌రిక చేశారు. తెలుగు యూట్యూబ‌ర్‌లు ఈ మ‌ధ్య చిన్న పిల్ల‌లు, హీరో హీరోయిన్లపై డార్క్ కామెడీ పేరుతో వీడియోలు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇలానే వీడియోలు చేసిన యూట్యూబ‌ర్ ప్ర‌ణీత్ హ‌నుమంత్‌ను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై ఎంతో మంది సెలబ్రిటీలు స్పందించారు. రాజకీయంగా కూడా ఈ విషయంలో దుమారం రేపింది. కాగా ఈ విషయంలో మా అధ్యక్షుడి హోదాలో  మంచు విష్ణు కూడా స్పందించారు.

ఇంటర్ కూడా చదవని స్టార్ హీరోయిన్.. కోట్లు సంపాదిస్తోంది..? వందల కోట్లకు వారసురాలు ఎవరో తెలుసా..?


ఆయన స్పందిస్తూ మన తెలుగు వాళ్లు ఇలా ఎలా చేయగలుగుతున్నారు. తెలుగు వారు అంటే సంస్కృతి, సంప్రదాయాలు మర్యాదస్తులు, పద్దతిగా ఉంటారు, ట్రెడిషన్స్ ఫాలో అవుతారు అని వ‌ర‌ల్డ్ వైడ్‌గా మంచి గుర్తింపు ఉంది. అలాంటి వాళ్లు ఇలాంటి వీడియోలు చేయ‌డం త‌ప్పు అంటూ ఒక వీడియో సందేశాన్ని సోషల్ మీడియాలో వదిలారు. న‌టిన‌టుల‌ను విమర్శిస్తూ చేసిన వీడియోలను, కామెంట్లను 48గంటల్లో తొలగించాలని లేక‌పోతే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయని మంచు విష్ణు హెచ్చ‌రించాడు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios