‘ఆచార్య’ కు దారి ఇచ్చి ‘పుష్ప’ ప్రక్కకు?

ఆగస్ట్ 13న పుష్ప సినిమా రిలీజ్ ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. ఇలాంటి పెద్ద సినిమాల మధ్య ఓ నెల అయినా గ్యాప్ ఉండాలి.మరీ  రెండు వారాలు గ్యాప్ తో వచ్చేస్తే సమస్యలు వస్తాయి. 

Acharya To Clash With Pushpa? jsp

అందరూ ఊహించినట్లుగానే  ‘ఆచార్య’ విడుదల వాయిదా పడింది. కరోనాతో మొదట నుంచి ఇబ్బంది పడుతూ వస్తోంది ఈ చిత్రం. షూటింగ్ షెడ్యూల్స్ మారటం, కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో షూటింగ్ కాన్సిల్, చివరకు విడుదల వాయిదా అవటం జరిగాయి.  చిరంజీవి, రామ్‌ చరణ్‌ ప్రధాన పాత్రల్లో కొరటాల శివ తెరకెక్కిస్తోన్న చిత్రమిది. మే 13న థియేటర్లలో సందడి చేయాల్సిన ఈ చిత్రం కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా పడింది. ఈ విషయాన్నిసోషల్ మీడియా వేదికగా ప్రకటించింది చిత్ర టీమ్. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ ఉంటుందా అని ఆరా తీస్తే ఆగస్టుకు వెళ్తుందని వినపడుతోంది.

 అప్పటికి ఈ పరిస్దితులు అన్ని చక్కబడి షూటింగ్,మిగతా పనులు పూర్తవుతాయని అంటున్నారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఆగస్టుకు రిలీజ్ పెట్టుకుంటే అదే నెలలో పుష్ప కు పోటీ అవుతుంది. ఆగస్ట్ 13న పుష్ప సినిమా రిలీజ్ ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. ఇలాంటి పెద్ద సినిమాల మధ్య ఓ నెల అయినా గ్యాప్ ఉండాలి. అయితే రెండు వారాలు గ్యాప్ తో వచ్చేస్తే సమస్యలు వస్తాయి. ఈ నేపధ్యంలో ఇప్పుడు ఆచార్య వెనక్కి వెళ్లాలా ,పుష్ప వెనక్కి తగ్గాలా అనే సమస్య వస్తుంది. చిరంజీవి అంటే ఉన్న అభిమానంతో అల్లు అర్జున్ తన సినిమాని ఆగస్ట్ లో కాకుండా వేరే నెలలో పెట్టుకుంటారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

ఇవన్నీ ప్రక్కన పెడితే...‘ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మే 13న ఆచార్య చిత్రాన్ని విడుదల చేయట్లేదు. అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాక కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం. మాస్క్‌ ధరించండి, ఇంట్లోనే ఉండండి.. సురక్షితంగా ఉండండి’ అని పేర్కొంది ఆచార్య ప్రొడక్షన్ సంస్థ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ. దేవాదాయ శాఖలో జరిగే అన్యాయాల ఇతివృత్తంగా ఈ చిత్రం రూపొందుతోంది.  కాజల్‌, పూజా హెగ్డే నాయికలు. మణి శర్మ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, లాహే లాహే పాట సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios