మెగా ప్యాన్స్ మూడేళ్ళుగా ఎదురుచూస్తున్న ఆచార్య మూవీ రిలీజ్ అయ్యింది. కాని ఇన్నాళ్ళ ఎదురు చూపులకు అనుకున్న ప్రతిఫలం సాధించలేక పోయారు ఆచార్య టీమ్. ఇక ఈమూవీ నుంచి ఫ్యాన్స్ కు స్పెషల్ సర్ ప్రైజ్ లు ఇస్తున్నారు  మేకర్స్.  

అనుకున్న అంచనాలు అందుకోలేకపోయింది ఆచార్య మూవీ. టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా రిలీజ్ అయిన ఆచార్య ఆడియన్స్ తో పాటు, ఫ్యాన్స్ ను నిరాశపరిచింది. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాకునికి కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. భారీ అంచ‌నాల‌తో శుక్ర‌వారం( ఏప్రిల్ 29)రిలీజ్ అయిన సినిమా ఫస్ట్ షో నుంచే నెగిటీవ్ టాక్‌ను తెచ్చుకుంది. 

మంచి క‌థనే తీసుకున్నాడు కొరటాల. ఆవిషయంలో ఆడియన్స్ పక్కాగా ఉన్నారు. కాని స్క్రీన్ ప్లే . డైరెక్షన్ విషయంలో మాత్రం కొత్త‌గా ఏమీ లేద‌ని, అందులోనూ కొర‌టాల మార్కు అస్సలు కనిపించలేదని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కొర‌టాల డైలాగ్స్, ఎలివేషన్స్ ప్రేక్ష‌కుల‌ను ఏ మాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయాయి. ఇక ఈసినిమా ఇప్ప‌టివ‌ర‌కు తెలుగు రాష్ట్రాల్లో 34 కోట్లకు పైగా షేర్‌ను సాధించింది. భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్న ఈమూవీ.. ఇలా డీలా పడి పోవడంతో మెగా టీమ్ డిస్సపాయింట్ లో ఉంది. 

ఇక ఇప్ప‌టికే కొన్ని చోట్ల ఆచార్య డ్రాప్స్ కనిపిస్తున్నాయి. ఇక ఈమూవీని పుంజుకునేలా చేయాలని చూస్తున్నారు టీమ్. అందుకే ఫ్యాన్స్ ఖుషీ అయ్యేలా డిఫరెంట్ గాప్లాన్ చేసుకుంటున్నారు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఓస్పెషల్ కామెడీ ప్రోమోను రిలీజ్ చేశారు టీమ్. ఈ వీడియో రిలీజ్ అయిన కొద్దిలోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్ క‌లిసి సెక్యూరిటీ ఆఫిస‌ర్ల గెట‌ప్‌ల‌లో కనిపించారు ఈ వీడియోలో. 

Scroll to load tweet…

సెక్యూరిటీ ఆసీసర్లుగా వచ్చి విలన్లను చంపుతూనే కామెడీ చేస్తుంటారు మెగా హీరోలు. ఈ సీన్ మాత్ర‌మే ఆచార్య‌లో హైలైట్‌గా ఉంద‌ని ప్రేక్ష‌కుల అభిప్రాయ‌పడ్డారు. మూడేళ్ళ త‌ర్వాత మెగాస్టార్‌ను వెండితెర‌పై చూడ‌బోతున్నాం అనే ఆశ‌తో ఉన్న మెగా అభిమానుల‌ను ఈ చిత్రం తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. మొద‌టి రోజు 30కోట్ల దాకా షేర్‌ను సాధించిన ఈ సినిమా రెండ‌వ రోజు స‌గానికి స‌గంపైనే క‌లెక్ష‌న్లు త‌గ్గి కేవ‌లం 5కోట్ల షేర్‌ను మాత్ర‌మే సాధించింది. 

ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ కొంచెం ప్లాస్ అయ్యింది. ఇక ఈమూవీలో రామ్ చరణ్ జోడీగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే నటించింది. అంతే కాదు త్వరలోనే ఆచార్య డిజిటల్ ప్లాట్ ఫామ్ ఎక్కే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మే చివ‌రి వారంలోపు ఓటీటీలో ఈసినిమా స్ట్రీమింగ్ కానున్న‌ట్లు తెలుస్తుంది. మ్యాట్నీ ఎంట‌ర్టైన‌మెంట్స్ బ్యాన‌ర్‌తో క‌లిసి రామ్‌చ‌ర‌ణ్ స్వీయ నిర్మాణంలో ఆచార్యాను తెర‌కెక్కించాడు.