Acharya Release : అనుకున్న డేట్ కే ఆచార్య.. రూమర్స్ నమ్మొదంటున్నారు
మెగాస్టార్ ఆచార్య సినిమా విషయంలో.. రోజుకో రూమర్ వినిపిస్తుంది. సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుందంటూ.. న్యూస్ చక్కర్ల కొడుతుంది. అయితే ఈ రూమర్ పై నిర్మాతలు క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది.
మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) కలిసి కొరటాల డైరెక్షన్ లో నటించిన సినిమా ఆచార్య. కొనిదెల ప్రొడక్షన్ లో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈమూవీ కోవిడ్ ఇబ్బందులు దాటుకుని.. షూటింగ్ కంప్లీట్ చేసుకుని.. రెండు సార్లు రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంటూ.. చివరికి వచ్చే ఏడాది పిబ్రవరి 4న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఆ టైమ్ వరకు పాన్ ఇండియా భారీ బడ్జెట్ సినిమాలన్నీ రిలీజ్ అయిపోతుండటంతో సేఫ్ జోన్ లో రిలీజ్ అవ్వచ్చు అని అనుకున్నారు మెగా టీమ్.
ఇక ఈమూవీ మరోసారి పోస్ట్ పోన్ అవుతుందంటూ.. క్రేజీ రూమర్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. రకరకాల కారణాల వల్ల మూవీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ.. న్యూస్ వైరల్ అయ్యింది. అఖండ సినిమా రిలీజ్ తరువాత.. ఆచార్య సినిమాలో కూడ కొన్ని మార్పులు చేయాలని మెగాస్టార్ భావించినట్టు సమాచారం. హీరోల ఎలివేషన్.. బిజీయం విషయంలో మార్పులు చేర్పులతో పాటు.. కొని సీన్స్ ను రీ షూట్ చేయాలని మెగస్టార్ భావించారట. దాంతో కొరటాలను మళ్ళీ పిలిపించి రీషూట్ చేయిస్తారన్న టాక్ గట్టిగా నడిచింది. ఈ కారణంగానే ఆచార్య రిలీజ్ ను పోస్ట్ పోన్ చేస్తారంటూ న్యూస్ గట్టిగా వినిపించింది.
అయితే అవన్నీ అబద్దాలని..ఆచార్య సినిమా రిలీజ్ డేట్ ను మార్చే ఉద్దేశ్యం ఏమీ లేదని మూవీ టీమ్ నుంచి ఇన్ ఫర్మేషన్ అందుతుంది. అనుకున్న టైమ్ కు .. అనుకున్నట్టుగానే పిబ్రవరి 4న ఆచార్య సినిమా రిలీజ్ అవుతుందంటూ మేకర్స్ గట్టిగా చెపుతున్నారు. దీనికి సంబంధించిన ప్లాన్ కూడా చేసుకున్నట్టు తెలుస్తోంది. సినిమా ప్రమోషన్స్ ను కూడా ముందు నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు టీమ్.
అటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్(RRR) జనవరి 7 న రిలీజ్ కాబోతుంది. ఈమూవీ ప్రమోషన్స్ లో చరణ్ బిజీగా ఉన్నారు. ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయిపోయిన వెంటన చరణ్ ఆచార్య ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. ఆలోపు మెగాస్టార్ ఆచార్య ప్రమోషన్స్ లో జాయిన్ అవుతారని సమాచారం. సినిమాను భారీగా ప్రమోట్ చేసి.. భారీ కలెక్షన్స్ సాధించడమే టార్గెట్ గా.. ఆచార్య టీమ్ ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు.
Also Read : Bangarraju: వాసివాడి తస్సాదియ్యా…దీని స్పీడ్ కు దండాలయ్యా
చిరంజీవి (Chiranjeevi)నక్స లైట్ గా.. ఆచార్యుడిగా రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నారు ఆచార్యలో. ఇక చరణ్ సిద్థ పాత్రలో కనిపించనున్నారు. చిరంజీవి జోడీగా సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) నటించింది. చరణ్ కు జంటగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) ఆడి పాడింది. ఇప్పటికే ఆచార్య నుంచి చలా అప్ డేట్స్ సందడి చేశాయి. ఆచార్య నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో మరిన్ని అప్ డేట్స్ ను రిలీజ్ చేయబోతున్నారు టీమ్.