ఛానెల్స్ కోసం దిగి వచ్చిన ‘ఆచార్య’
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో చిరంజీవి ఆచార్యగా కనిపించనుండగా రామ్‌చరణ్ సిద్ధ పాత్ర పోషించాడు. కాజల్ నాయిక. రామ్‌చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆచార్య’. కాజల్ అగర్వాల్ హీరోయిన్. ఈ సినిమా వేసవిలోనే థియోటర్స్ లోకి రావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. లాక్‌డౌన్ అనంతరం చిత్రీకరణ పునఃప్రారంభమైన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఈ సినిమా బిజినెస్ సైతం ఊపందుకుంది. కొరటాల శివ, చిరంజీవి, రామ్ చరణ్ కాంబో కావటంతో డిస్ట్రిబ్యూటర్స్ నుంచి స్టన్నింగ్ ఆఫర్స్ వచ్చాయి. దాంతో ఇప్పటికే థియోటర్ బిజినెస్ ఈ సినిమా పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమా శాటిలైట్ బిజినెస్ మాత్రం పూర్తి కాలేదని సమాచారం. అందుకు కారణం శాటిలైట్ రైట్స్ రేటు కూడా ఓ రేంజిలో నిర్మాతలు కోట్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న ఓటీటి పోటీ నేపధ్యంలో ఛానెల్స్ ఆ స్దాయి రేటులు పెట్టేందుకు సిద్దంగా లేవు.
దాంతో కొద్ది కాలంగా నెగోషియోషన్స్ జరుగుతున్నాయి. లాక్ డౌన్ ముందు నుంచీ ఇదే పరిస్దితి. చివరకు పరిస్దితిని అర్దం చేసుకున్న నిర్మాతలు దిగి వచ్చినట్లు సమాచారం. ఛానెల్స్ అడుగుతున్న రేటుకు దగ్గరలో ఓ రేటుని ఫిక్స్ చేసి ఇచ్చేయాలనుకుంటున్నారట. ఈ మేరకు ఓ రేటుని ఫైనల్ చేసినట్లు చెప్పుకుంటున్నారు. స్టార్ మా వారు ప్రస్తుతం డిస్కషన్స్ లో ఉన్నారట. త్వరలోనే డీల్ క్లోజ్ కావచ్చు అంటున్నారు.
ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది . దేవాదాయ శాఖ నేపథ్యంలో సాగే కథ ఇది. ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. చిరంజీవి తనయుడు, నటుడు రామ్‌చరణ్ కీలక పాత్ర పోషిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో రామ్ చరణ్‌కి జోడీగా పూజా హెగ్డే కనిపించనుంది. మరోవైపు మలయాళీ చిత్రం ‘లూసీఫర్’ తెలుగు రీమేక్‌కి సిద్ధమయ్యారు చిరంజీవి. ఈ చిత్రాన్ని మోహన్ రాజా తెరకెక్కించనున్నారు. కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నారు.
రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ‘సిద్ధ’అనే ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆ మధ్యన తండ్రీ తనయుల కాంబినేషన్‌లో కీలకమైన సన్నివేశాలను సింగరేణి ప్రాంతంలో చిత్రీకరించారు. అలాగే ఇప్పటికే ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలై ప్రేక్షకుల మన్ననలు పొందిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా నటి కాజల్ చిరు సరసన నటిస్తోంది. మరొక పాత్రలో పూజాహెగ్డే చరణ్‌కు జోడిగా నటిస్తోంది. అయితే ‘ఆచార్య’ థియేటర్లో పాఠాలు ఎప్పటినుంచి చెప్పనున్నారు అనేది మాత్రం క్లారిటీ లేదు.