ప్రముఖ దర్శకుడు... కొరటాల శివ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై హీరో రామ్ చరణ్, నిరంజన్‌రెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా... ఇప్పటి వరకు జరిగిన షూటింగ్‌తో 40 శాతం షూటింగ్ పూర్తియింది.
‘సైరా నరసింహా రెడ్డి’ తరువాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు... కొరటాల శివ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై హీరో రామ్ చరణ్, నిరంజన్‌రెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా... ఇప్పటి వరకు జరిగిన షూటింగ్‌తో 40 శాతం షూటింగ్ పూర్తియింది.
రెండు రాష్ట్రాలలో కరోనా వైరస్ ప్రబలడంతో ఈ చిత్ర షూటింగ్‌ని నిరవధికంగా చిత్రం టీమ్ నిలిపివేసింది. అయితే అతి త్వరలోనే షూటింగ్‌ని ప్రారంభించాలని, చిరుకు సంబంధించిన కీలక ఘట్టాలని పూర్తి చేయాలని దర్శకుడు కొరటాల శివ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది చర్చనీయాంశంగా మారింది. అందుతున్న సమాచారం మేరకు నిర్మాతలు, దర్శకుడు కలిసి ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసారని, చిరు దానికి ఓటేసారని సమాచారం.
మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రంగా తెరకెక్కుతున్న 'ఆచార్య' చిత్రం, లాక్ డౌన్ రాకుండా ఉండి వుంటే, దసరా, దీపావళి సీజన్ లోనే విడుదలై ఉండేది. ఇప్పుడిక మిగతా 60 శాతం షూటింగ్ ఎప్పటికి పూర్తవుతుందో తెలియని సిట్యువేషన్. అయితే, సినిమా విడుదల తేదీని నిర్మాతలు లాక్ చేసేశారని వినపడుతోంది. తెలుగు ఇండస్ట్రీలో ఏప్రిల్ 9కి ఎంత క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు. ఆ రోజు విడుదలైన దాదాపు అన్ని చిత్రాలూ సూపర్ హిట్ గా నిలిచాయి.ఇప్పుడు 'ఆచార్య'ను కూడా ఏప్రిల్ 9న విడుదల చేయనున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి.
కొరటాల శివకు కెరీర్ లో ఇప్పటివరకు ఒక్క ప్లాప్ కూడా లేకపోవటమే కలిసొచ్చే అంశం. ఆయన ప్రతీ సినిమా ఆ హీరోల కేరీర్ లో బిగ్గెస్ట్ హిట్లు అయ్యాయి. పక్కా సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రెజీనా ఒక ప్రత్యేక పాటలో కనిపించనుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి రెండు విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి.
