మెగాస్టార్ ఫ్యాన్స్ నేడు ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఆచార్య టీజర్ వారి అంచనాలకు మించి ఉన్న నేపథ్యంలో బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమని ఫిక్స్ అయిపోయారు. ఇక చిరు మేనరిజం, మాస్ లుక్ వారికి తెగనచ్చేసింది. దీనితో టీజర్ ని పదే పదే చూస్తూ పండగ చేసుకుంటున్నారు. ఓ ప్రక్క టీజర్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న చిరు ఫ్యాన్స్ కి గంటల వ్యవధిలో మరో ట్రీట్ ఇచ్చారు ఆయన. ఆచార్య విడుదల తేదీ అధికారికంగా ప్రకటించేశారు. 

ఆచార్య టీజర్ లో సమ్మర్ విడుదల అని తెలిపిన చిత్ర యూనిట్.. కొద్దిసేపటి తరువాత మే 13న ఆచార్య విడుదల కానున్నట్లు స్పష్టత ఇచ్చారు. దీనితో మెగా ఫ్యాన్స్ సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 2019 లో సైరా విడుదల చేసిన చిరంజీవి 2021 మే  నెలకు ఆచార్యను సిద్ధం చేశారు. కరోనా వైరస్ విపత్తు లేని క్రమంలో గత ఏడాదే ఆచార్య విడుదల అయ్యేది . 

దర్శకుడు కొరటాల శివ ఓ సామాజిక అంశానికి అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ అంశాలు జోడించి మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారని టీజర్ చూస్తే అర్థం అయ్యింది. టీజర్ సినిమాపై అంచనాలు మరింత పెంచి వేసింది.  కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ ఓ కీలక రోల్ చేయడం విశేషం. స్వర బ్రహ్మ మణిశర్మ చాలా కాలం తరువాత చిరంజీవి సినిమాకు సంగీతం అందిస్తున్నారు.