ఆచార్య యూనిట్ నేడు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఆచార్య మూవీలో చరణ్ రోల్ నిడివి గురించి పలు అనుమానాలుండగా చరణ్ క్లారిటీ ఇచ్చారు. 


ఆచార్య (Acharya)మూవీలో చరణ్ పాత్ర ఎలా ఉంటుంది. ఏ పాత్ర నిడివి ఎంత అనే విషయాలపై అనేక అనుమానాలున్నాయి. మొదటి నుండి చరణ్ ది గెస్ట్ రోల్ మాత్రమేనన్న ప్రచారమవుతోంది. అయితే ట్రైలర్ విడుదల తర్వాత అంచనాలు మారిపోయాయి. ట్రైలర్ లో చిరు (Chiranjeevi)పాత్రకు సమానంగా చరణ్ ని చూపించారు. అదే సమయంలో చరణ్ పాత్రకు మాత్రమే హీరోయిన్ ఉంది. చిరంజీవి పాత్రకు లేదు. ఇవన్నీ గమనించిన ప్రేక్షకులు ఆచార్య చరణ్ సినిమాగా భావిస్తున్నారు. 

ఈ క్రమంలో ఓ మీడియా ప్రతినిధి చరణ్ ఉద్దేశిస్తూ ఓ ప్రశ్న అడిగారు. ఆర్ ఆర్ ఆర్ (RRR Movie)థియేటర్స్ లో ఉండగానే ఆచార్య మూవీ విడుదల చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఏ స్టార్ హీరో కూడా ఇంత త్వరగా చిత్రాలు విడుదల చేయలేదు. ఈ జనరేషన్ హీరోలలో ఇది అరుదైన విషయం. మీరు ఎలా ఫీల్ అవుతున్నారని, అడుగగా... చరణ్ ఆసక్తికర సమాధానం చెప్పారు. ఆయన మాట్లాడుతూ... ఆచార్య నా సినిమాగా నేను భావించడం లేదని చరణ్ తెలిపారు. కారణం ఈ మూవీలో నాది 40 నిమిషాల నిడివి కలిగిన కీలక రోల్ మాత్రమే కాబట్టి. ఆచార్య పూర్తిగా చిరంజీవి గారి చిత్రం. కాబట్టి ఆచార్య నా మూవీ అని అనుకోవడం లేదని చరణ్ చెప్పారు. 

చరణ్ (Ram Charan)ఆన్సర్ తో ఆచార్య మూవీలో ఆయన పాత్రపై పూర్తి క్లారిటీ వచ్చింది. మొదటి నుండి ప్రచారం అవుతున్నట్లు చరణ్ కేవలం గెస్ట్ రోల్ మాత్రమే చేస్తున్నట్లు స్పష్టత వచ్చింది. పాద ఘట్టం ప్రాంతానికి చెందిన సిద్ధంగా ఆయన కనిపించనున్నారు. పాద ఘట్టం సిద్ద నక్సల్ సిద్ధగా ఎలా మారాడు. ఆచార్యను ఎందుకు కలిశాడు? అనేది ఆయన పాత్రలోని ఆసక్తికర అంశాలుగా తెలుస్తున్నాయి. 

ఏప్రిల్ 29న ఆచార్య విడుదల అవుతుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, సోనూ సూద్ విలన్ రోల్ చేస్తున్నారు. ఆచార్య చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.