రోబో షూటింగ్ సందర్భంగా సూపర్ స్టార్ రజినీకి గాయం కొంత కాలం విశ్రాంతి తప్పదనని చెప్పిన వైద్యులు
క్రియేటివ్ జీనియస్ శంకర్ తెరకెక్కిస్తున్న రోబో చిత్రం షూటింగ్ సందర్భంగా సూపర్ స్టార్ రజినీ కాంత్ కు గాయమైంది. 2.0 చిత్ర షూటింగ్ జరుగుతున్న ఫ్లోర్ వర్షం కారణంగా తడి తడిగా ఉండటమే ఇందుకు కారణమట.రజినీ జారిపడటంతో యూనిట్ రజనీకాంత్‌ను వెంటనే దగ్గరున్న హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.
చికిత్స చేసిన వైద్యులు రజనీకాంత్‌ను కొంత కాలం విశ్రాంతి తీసుకోమన్నారట. అభిమానులేమీ కంగారు పడనవసరం లేదని, కాలి నొప్పి తగ్గగానే రజనీకాంత్ తిరిగి షూటింగ్‌లో పాల్గొంటారని యూనిట్ వర్గాలు తెలియజేస్తున్నాయి
