వరల్డ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ స్టూడియోలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈప్రమాదంలో ఒకరు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అసలీ ప్రమాదం ఎలా జరిగింది.. మృతి చెందింది ఎవరు వివరాల్లోకి వెళ్తే..?
తమిళ సినీ పరిశ్రమలో ఈ మధ్య ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. షూటింగ్ స్పాట్స్ లో.. స్టూడియోలలలో ప్రమాదాలు తరుచూజరుగుతుండటం.. ఇండస్ట్రీ వారిని కలవరపెడుతుంది. ముఖ్యంగా భారతీయుడు2 సెట్స్ లో జరిగిన ప్రమాదాలు కాని.. విశాల్ షూటింగ్స్ లో జరిగిన ప్రమాదాలు.. ఇలా ప్రమాదాల్లో కొంత మంది టెక్నీషియన్స్ ను కూడా కోల్పోయింది కోలీవుడ్. తాజాగా అలాంటి సంఘటనే మళ్లీ రిపీట్ అయ్యింది. ఏఆర్ రెహ్మన్ స్టూడియోలో ప్రమాదం జరిగింది.
కిందస్థాయి నుంచి స్టార్ గా ఎదిగాడు ఏఆర్ రెహమాన్. కష్టపడి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఆయన..ఎన్నో లైవ్ ప్రోగ్రామ్స్ చేస్తూ.. సినిమాలు చేస్తూ.. ఆస్కార్ రేంజ్ కు ఎదిగారు. ఏఆర్ రెహమన్ కు చెన్నైలో ఓ పెద్ద స్టూడియో కూడా ఉంది. ఈ స్టూడియో ద్వారా రోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. ఈక్రమంలోనే రోజు మాదిరిగానే స్టూడియోలో ఒ ప్రోగ్రామ్ కోసం ఏర్పాట్లు చేస్తుండగా.. ఓ ప్రమాదం చోటుచేసుకుంది. ఈప్రమాదంలో ఒకరు మృతి చెందినట్టు తెలుస్తోంది.
చెన్నైలోని తిరువళ్లూరు ఏరియాలో ఉన్నరెహమాన్ కు చెందిన పంచతాన్ రికార్డింగ్ స్టూడియో లో లైట్ బిగిస్తుండగా.. కరెంట్ షాక్ కి గురై లైట్ మెన్ కుమార్ అక్కడికక్కడే కన్నుమూసినట్లు సమాచారం. ఈపరిణామంతో అంతా షాక్ అయినట్టుతెలుస్తోంది. విషయం తెలుసకున్న పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యప్తు చేస్తున్నారట. ఈ సంఘటన కోలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. అయితే.. స్టూడియోలో ప్రమాదం ఎలా జరిగింది? అనే వివరాలు తెలియాల్సి ఉంది.
ఇక చాలా కాలం గ్యాప్ తరువాత ఈ మధ్య కాలంలో ఏఆర్ రెహమాన్ వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం రెహమాన్ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. లాస్ట్ ఇయర్ విక్రమ్ కోబ్రా త పాటు లైఫ్ ఆఫ్ ముత్తు, పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 లాంటి సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించారు రెహ్మాన్. మరో రెండేళ్లపాటు ఆయన ఫుల్ బిజీ కాబోతున్నాడు. ఇక ఈక్రమంలో ఆయన స్టూడియోలో జరిగిన ప్రమాదం గురించి రెహమాన్ ఎలా స్పందించాడో చూడాలి.
