సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో తన దర్శకత్వంలో వస్తోన్న సినిమాలను ఎక్కువగా తన శిష్యులతోనే డైరెక్ట్ చేయిస్తున్నాడనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. 'కిల్లింగ్ వీరప్పన్', 'వంగవీటి' వంటి సినిమాల విషయంలో వర్మ ఇదే ఫాలో అయ్యాడని అంటారు.

ఫోన్, వాట్సాప్ ద్వారా తనకేం కావాలో సెట్లో ఉన్నవాళ్లకు చెబుతుంటాడట ఈ దర్శకుడు. ఒక్క ఎడిటింగ్ రూమ్ లో మాత్రం సినిమా విషయంలో కట్ లో ప్యాచింగ్ లు చెబుతాడట. 

'లక్ష్మీస్ ఎన్టీఆర్' విషయంలో కూడా ఇదే జరిగిందని టాక్. ఈ సినిమా కోసం ఆయన కెప్టెన్ కుర్చీలో కూర్చోవడం చాలా అరుదుగానే జరిగిందని టాక్. ఆఫీస్ లో కూర్చునే తన అసిస్టెంట్ లతో పని కానిచ్చేశాడని అంటున్నారు.

ఇప్పటివరకు తన శిష్యులకు టైటిల్ కార్డ్ విషయంలో క్రెడిట్ ఇవ్వని వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' విషయంలో మాత్రం అగస్త్య మంజు అనే యువకుడికి క్రెడిట్ ఇచ్చాడు. అయితే సినిమా ప్రమోషన్స్ లో మాత్రం అగస్త్య ఎక్కడా కనిపించడం లేదు. బహుసా ఇది కూడా వర్మ ప్లానింగ్ లో భాగమేనేమో!