Asianet News TeluguAsianet News Telugu

అక్కడున్నది ప్రభాస్... భయపడక్కర్లేదు

ఈ మధ్య కరోనా వచ్చి అన్ని రంగాలని దెబ్బ కొట్టింది. ముఖ్యంగా సిని పరిశ్రమను అసలు షూటింగ్ లు, రిలీజ్ లు లేకుండా చేసేసింది. ఈ నేపధ్యంలో నిర్మాతలు అందరూ భయపడుతున్నారు. తాము పెట్టే పెట్టుబడి సేఫ్ గా వెనక్కి లాగగలమా అనేది వారి మదిని తొలుస్తున్న ప్రశ్న. ప్రభాస్ తో తీసే నిర్మాతలకు కూడా సహజంగానే ఆ భయం ఉంటుంది కదా. మరి వాళ్లేం డెసిషన్ తీసుకున్నారో చూద్దాం.
 

About Prabhas,Nag Ashwin movie  Budget
Author
Hyderabad, First Published Aug 6, 2020, 12:53 PM IST

బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ చాలా రెట్లు పెరిగిపోయింది. ఆయన సినిమాలు దేశ వ్యాప్తంగా రిలీజ్ అయ్యే పరిస్దితి నెలకొంది. అన్ని ప్రాంతాల్లోనూ ఆయనకు అభిమానులు ఉన్నారు. ఈ నేపధ్యంలో ఆయన మీద ఎంత బడ్జెట్ పెడితే వర్కవుట్ అవుతుందనేది నిర్మాతకు ఓ అంచనాకు రావటం కష్టంగా ఉంది. అయితే పాన్ ఇండియా సినిమాలు ప్రభాస్ తో తీస్తారు కాబట్టి మినిమం రెండు వందలు నుంచి మూడు వందల లోపు పెట్టచ్చు అని డిసైడ్ అవుతున్నారు.

 అంతా బాగానే ఉంది కానీ ..ఈ మధ్య కరోనా వచ్చి అన్ని రంగాలని దెబ్బ కొట్టింది. ముఖ్యంగా సిని పరిశ్రమను అసలు షూటింగ్ లు, రిలీజ్ లు లేకుండా చేసేసింది. ఈ నేపధ్యంలో నిర్మాతలు అందరూ భయపడుతున్నారు. తాము పెట్టే పెట్టుబడి సేఫ్ గా వెనక్కి లాగగలమా అనేది వారి మదిని తొలుస్తున్న ప్రశ్న. ప్రభాస్ తో తీసే నిర్మాతలకు కూడా సహజంగానే ఆ భయం ఉంటుంది కదా. మరి వాళ్లేం డెసిషన్ తీసుకున్నారో చూద్దాం.

సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ...ప్ర‌భాస్ సినిమా బ‌డ్జెట్ విష‌యంలో మాత్రం ఎలాంటి కోత‌లూ పెట్టాలనే ఆలోచనలో నిర్మాతలు లేరట. మరీ ముఖ్యంగా ప్ర‌భాస్ - నాగ అశ్విన్ కాంబినేష‌న్ లో రూపొందబోయే సినిమాపై ఈ ఇంపాక్ట్ ఉండదని అంటున్నారు. వేరే హీరో అయితే ఖచ్చితంగా బడ్జెట్ కోత పెడుదుము కానీ ప్రభాస్ సీన్ లో ఉంటే భయమేంటి అంటున్నారు. దానికి తోడు ఈ సినిమాలో దీపికా ప‌దుకొణె హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న క‌రోనాకి ముందే వ‌చ్చేసింది. 

ప్రకటన సమయంలోనే ఈ సినిమా బ‌డ్జెట్ చెప్పేశారు. 250 కోట్ల‌తో ఈసినిమాని తెర‌కెక్కిస్తామ‌ని నిర్మాతలు ప్ర‌క‌టించేశారు. అయితే క‌రోనా ప్ర‌భావంతో ఈ సినిమా బ‌డ్జెట్ త‌గ్గుతుంద‌ని మీడియాలో వార్తలు వస్తుున్నాయి. అయితే అలాంటిదేం లేద‌ట‌. ఈసినిమా బ‌డ్జెట్ కొంచెం కూడా త‌గ్గ‌డం లేద‌ని, అనుకున్న విధంగానే ఈ సినిమాపై 250 కోట్లు ఖ‌ర్చు పెట్టేస్తున్నార‌ని చెప్తున్నారు.   

ఇక ఈ చిత్రం షూటింగ్, గ్రాఫిక్స్ అన్నీ పూర్తి చేసుకుని రిలీజ్ కు వచ్చేసరికి 2023 వచ్చేస్తుందని మీడియాలో అంచనా వేస్తున్నారు. మొదట 2022 రిలీజ్ అనుకున్నారు. కానీ ఇప్పుడు మరో సంవత్సరం ముందుకు వెళ్లింది. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన ఏదీ లేదు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పూర్తి చేసారు.అలాగే ఇప్పటికే నాగ్ అశ్విన్‌ స్క్రిప్ట్ కూడా కంప్లీట్ చేసి లాక్ చేసాడట.  
 
 నిర్మాత అశ్వనీదత్ మాట్లాడుతూ.. నిజానికి ప్రభాస్‌ను హీరోగా మా సంస్థ ద్వారా పరిచయం చేయాలనుకున్నాము. కానీ కుదరలేదు. ఈలోగా బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ హీరో గా ఎదిగాడు. మహానటి తర్వాత నాగ్ అశ్విన్.. ప్రభాస్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఓ కథ రాసాడు. ఆ స్టోరీ విని నేను  ఆశ్చర్యపోయాను. ప్రభాస్ అయితేనే ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ అవుతుందని నాగ్ అశ్విన్ అన్నాడు. ఆ తర్వాత ఈ కథను ప్రభాస్‌కు వినిపించడం.. ఆయన ఓకే చేయడం జరిగింది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios