బిగ్‌బాస్‌ ఆరోవారం శనివారం షో అంతగా కిక్‌ ఇవ్వలేదు. గత వారంలో ఎలిమినేషన్‌ ప్రక్రియ ఉండేది. ఎలిమినేట్‌ అయ్యేవారు. కానీ ఈ వారం కేవలం ముగ్గురే సేవ్‌ అయ్యారు. అయితే అభిజిత్‌, అఖిల్‌ మధ్య వివాదం మరోసారి రచ్చకెక్కింది. 

శనివారం నాగార్జున ఈ వారం మొత్తం జరిగిన విషయాలను బయటకు తీశారు. ఇందులో అభిజిత్‌, అఖిల్‌ మధ్య వివాదం హైలైట్‌ అయ్యింది. సంచాలక్‌గా అభిజిత్‌ వేస్ట్ అని  ఆయన్ని నామినేట్‌ చేశాడు అఖిల్‌. ఈ టాపిక్‌ వచ్చినప్పుడు మరోసారి ఇద్దరి మధ్య వివాదం పెరిగింది. ఐదో వారం కెప్టెన్సీ టాస్క్‌ `కింద నిప్పు చేతిలో మంచు మధ్యలో ఓర్పు ` అనే టాస్క్‌కు అభిజిత్ సంచాలక్‌గా ఉన్న సంగతి తెలిసిందే. అందులో అఖిల్, అవినాష్, సోహెల్ పార్టిసిపేట్ చేశారు. అఖిల్ ముందుగా టాస్క్ విరమించాడు. కానీ సంచాలక్‌గా అభిజిత్ సరైన న్యాయం చేయలేదన్న నెపంతో అఖిల్ నామినేట్ చేశాడు. మిగిలిన ఇద్దరిలో ఒకరు టచ్ అయ్యారని అఖిల్ ఆరోపిస్తున్నాడు కానీ ఎవరో చెప్పడం లేదు.

ఎవరు టచ్ అయ్యారో వారి పేరు చెప్పమని నాగార్జున ముందే అఖిల్‌ను అడిగాడు అభిజిత్. అది నేను ఎందుకు చెబుతాను, చెప్పనని చెప్పాడు. నాగార్జున మాత్రం మండిపడ్డాడు. సంచాలక్ చెప్పిందే ఫైనల్ అంటూ అఖిల్‌కు  స్ట్రాంగ్‌గా చెప్పాడు. అంతటితో అయిపోలేదు. ఒకరి గురించి మరొకరు మనసులోని మాట రాసే టాస్క్ లోనూ అఖిల్‌, అభిజిత్‌ మధ్య వాగ్వాదం జరిగింది. అభిజిత్‌పై మోనాల్‌ సైతం ఫైర్‌ అయ్యింది. 

అభిజిత్ మోనాల్ విషయాన్ని నాగార్జున మళ్లీ ప్రస్థావించినట్టున్నాడు. అయితే మోనాల్ అక్కడో మాట ఇక్కడో మాట చెప్పడంపై కంప్లైంట్ చేశాడు.. మోనాల్‌ను నాగ్ ముందే ఎండగట్టేశాడు అభిజిత్. నువ్ మెహబూబ్‌తో మాట్లాడావా? లేదా అంటూ ప్రశ్నించడంతో మోనాల్ షాక్‌ అయ్యింది. దీంతోపాటు దివిని మోనాల్‌ `ఐ హేట్‌ హర్‌` చెప్పడం చర్చనీయాంశంగా మారింది.