సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి మూడు నెలలు అవుతున్నా ఆయన సన్నిహితులు ఆ బాధ నుంచి తేరుకోలేకపోతున్నారు. తాజాగా సుశాంత్ తో రెండు చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు అభిషేక్‌ కపూర్‌ యంగ్ హీరోతో తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. సుశాంత్ నటించి కై పో  చే, కేదార్‌ నాథ్ సినిమాకు అభిషేకే దర్శకుడు. కేధార్‌ నాథ్‌ సినిమా మూడేళ్ల క్రితం ఇదే రోజున ప్రారంభమైంది. ఈ సందర్భంగా సుశాంత్‌తో తన అనుభవాలను ఓ వీడియో రూపంలో షేర్ చేసుకున్నాడు అభిషేక్‌.

అభిషేక్‌ షేర్ చేసిన వీడియో అభిమానులతో కంటతడి పెట్టిస్తోంది.. ఈ వీడియోతో పాటు ఎమోషనల్‌ పోస్ట్ ను షేర్ చేశాడు దర్శకుడు. `మనం ఇద్దం కలిసి చేసిన లాస్ట్‌ డ్యాన్స్‌ మూడేళ్ల క్రితం ఇదే రోజు కేదార్‌నాథ్‌లో జరిగింది. మనం కలిసున్న సమయంలో  ఎన్నో జ్ఞాపకాలు నన్ను ఇప్పటికీ వెంటాడుతున్నాయి. నిన్ను నీ అభిమానులు ఎంతగా ప్రేమిస్తున్నారో నీకు తెలుసు.

నీకు న్యాయం చేయడానికి నీ అభిమానులు ఎంతా పోరాడుతున్నారో నీకు తెలుసు. వారు ప్రపంచాన్ని తల కిందులు చేస్తున్నారు. నువ్వు అన్న `వదిలేయండి సర్‌.. మన పనే మాట్లాడుతుంది` అన్న మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి` అంటే ట్వీట్ కామెంట్ చేశాడు అభిషేక్ కపూర్‌.