సెలబ్రిటీలు కొన్ని సార్లు ట్రోల్‌కి గురవుతుంటారు. కొందరు నెటిజన్లు పనిగట్టుకుని వారిని వివాదాల్లోకి లాగే ప్రయత్నం చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు సెలబ్రిటీలు వాటిని వదిలేస్తే, మరికొందరు ట్రోలర్‌కి గట్టిగా  రిప్లై ఇచ్చి వారి  నోళ్లు మూయిస్తుంటారు. అభిషేక్‌ బచ్చన్‌ పై ఓ ట్రోలర్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఐశ్వర్యరాయ్‌ లాంటి అందమైన అమ్మాయిని భార్యగా పొందేందుకు ఏం అర్హత ఉందంటూ ఆ నెటిజన్‌ ప్రశ్నించాడు. 

ఈ సందర్భంగా అతను అభిషేక్‌ బచ్చన్‌తోపాటు మరికొంత మంది సెలబ్రిటీలను ట్యాగ్‌ చేశాడు. ఇది చూసిన అభిషేక్‌ గట్టిగానే స్పందించారు. ఘాటుగా రిప్లై ఇచ్చాడు. అభిషేక్‌ ఇచ్చిన రిప్లైకి అతని మైండ్‌ బ్లాంక్‌ అయిపోయింది. ఆ వివరాల్లోకి వెళితే, ఇటీవల అభిషేక్‌ బచ్చన్‌ తాను నటిస్తున్న `బిగ్‌బుల్‌` చిత్ర ట్రైలర్‌ని ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా ఓ నెటిజన్‌ `మీరు అన్ని విషయాల్లో చాలా బాగుంటారు. కానీ ఒక్క విషయంలో మిమ్మల్ని చూస్తే ఈర్ష్యగా ఉంది. మీకు చాలా అందమైన భార్య లభించింది. అంతటి అందమైన అమ్మాయిని భార్యగా పొందే అర్హత మీకుందా?` అని ప్రశ్నించాడు. 

దీనికి అభిషేక్‌ స్పందించాడు. `మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు థ్యాంక్యూ బ్రదర్. ఏదో క్యూరియాసిటీ కోసం అదుగుతున్నా. నువ్వు  ఇందులో చాలా మంది పెళ్లి కాని వారిని ట్యాగ్‌ చేశావ్‌.. వీరిలో ఇలియానా, నిక్కి వీరంతా నాకు తెలుసు.. కానీ నువ్వెవరు.. అసలు నీ అర్హత ఏంటి?` అని దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చాడు. దీనిపై మిగతా నెటిజనులు మద్దతు పలుకుతున్నారు. `అభిషేక్‌ ట్రోలర్స్‌ని మీరు హ్యాండిల్‌ చేసే తీరు సూపర్బ్` అంటూ పోస్ట్ పెట్టారు.  `బిగ్‌ బుల్‌` చిత్రం ఏప్రిల్‌ 8న విడుదలవుతుంది. ఈ చిత్రంలో అభిషేక్‌ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ఇలియాన, నికితా దత్తా, మహేష్‌ మంజ్రేకర్‌ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.