అభిషేక్‌ బచ్చన్‌ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. థ్రోబ్యాక్‌ ఫోటోని పంచుకుంటూ విషెస్‌ తెలియజేయడం విశేషం. ఐశ్వర్యా రాయ్‌, ఆయన కూతురు ఆరాధ్యలతోపాటు అభిషేక్‌ సరదాగా హోలీ జరుపుకుంటున్నట్టుగా ఉన్న ఈ ఫోటో వైరల్‌ అవుతుంది. ఇందులో గతంలో హోలీని ఎంత ఆనందంగా, సురక్షితంగా జరుపుకున్నాము, ఎంత స్వేచ్ఛగా జరుపుకున్నామో గుర్తు చేసుకున్నారు. 

ఆనాటి రోజులను గుర్తు చేసుకుంటూ హోలీ విషెస్‌ తెలిపారు. `ప్రతి ఒక్కరికి హోలీ శుభాకాంక్షలు. అత్యంత అందమైన ఫెస్టివల్‌ని సెలబ్రేట్‌ చేసుకోండి. కానీ సురక్షితంగా చేసుకోండి. దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతుననాయి. మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లోనే ఉండండి. మీ పేరెంట్స్ బ్లెస్సింగ్స్ తీసుకోండి, ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోండి` అని చెప్పారు. ఇందులో మై గర్స్ అంటూ యాష్‌ ట్యాగ్‌ పంచుకున్నారు. ఈ సందర్బంగా అభిషేక్‌ పంచుకున్న ఫోటో వైరల్‌ అవుతుంది. ప్రస్తుతం ఆయన `ది బిగ్‌ బుల్‌`,`బాబ్‌ బిశ్వాస్‌`,`దాస్వి` చిత్రాల్లో నటిస్తున్నారు.