నిర్మాత అభిషేక్ అగర్వాల్ చేతిలో ఈ మలయాళ సినిమా రీమేక్ రైట్స్ ఉన్నాయి. ఈ మేరకు నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు. ఆయన పొరింజు మరియం జోస్ ని త్వరలో నిర్మిస్తున్నట్లు తెలియచేసారు.


గత కొంతకాలంగా అక్కినేని నాగార్జున సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా నాగ్ చేసిన ది ఘోస్ట్ సైతం బాక్స్ ఆఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. ఈ క్రమంలో నాగార్జున నెక్ట్స్ సినిమాలపై ఫోకస్ చేస్తున్నారు.అందులో ఓకే సారి మూడు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఈ క్రమంలో ప్రస్తుతం ఫామ్ లో ఉన్న రైటర్ ప్రసన్న కుమార్ దర్శకత్వంలో నాగార్జున ఓ సినిమా ఓకే చేసారు. పొరింజు మరియం జోస్ అనే మలయాళ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమా కు రీమేక్ రైట్స్ సమస్య వచ్చి పడిందని వినపడుతోంది.

Scroll to load tweet…
Scroll to load tweet…

అందుతున్న సమాచారం మేరకు నిర్మాత అభిషేక్ అగర్వాల్ చేతిలో ఈ మలయాళ సినిమా రీమేక్ రైట్స్ ఉన్నాయి. ఈ మేరకు నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు. ఆయన పొరింజు మరియం జోస్ ని త్వరలో నిర్మిస్తున్నట్లు తెలియచేసారు.టాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ హిట్స్‌తో దూసుకుపోతున్న నిర్మాణ సంస్థ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ . గతేడాది ‘కార్తికేయ2, కశ్మీర్ ఫైల్స్’ చిత్రాలతో హిట్స్ అందుకున్న ఈ సంస్థ ప్రస్తుతం మాస్ మహరాజ రవితేజతో ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్రాన్ని నిర్మిస్తోంది.

 ఈ క్రమంలోనే మలయాళ బ్లాక్ బస్టర్ ‘పొరింజు మరియం జోస్’మూవీ రీమేక్ రైట్స్‌ సొంతం చేసుకుంది. ఆడియన్స్‌కు క్వాలిటీ కంటెంట్ ఇవ్వాలనే లక్ష్యంతో సినిమాలు నిర్మిస్తున్న ఈ ప్రొడక్షన్ హౌస్.. అదే ప్రయత్నంలో భాగంగా ఈ సినిమా తెలుగు రీమేక్‌ను హోలీ రోజున ప్రకటించింది. ప్రీ పొడక్షన్‌తో పాటు తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కథలో మార్పులకు సంబంధించిన పనులు ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయని పేర్కొంది. ఇక ఈ రీమేక్‌లో టాలీవుడ్ టాప్ స్టార్ నటిస్తాడని.. మిగతా విభాగాలకు సంబంధించి టాలెంటెడ్ టీమ్ పనిచేయనుందని వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియచేస్తామని ప్రకటించింది.

 దాంతో నాగార్జున కు ఈ కథ విషయమై సమస్య వచ్చి పడిందని వినికిడి. అభిషేక్ అగర్వాల్ ఈ రైట్స్ ని నాగ్ కు ఇవ్వటానికి ఇష్టపడటం లేదని వార్తలు వస్తున్నాయి. అందుకు ఓ కారణం కూడా ఉంది. మొదట ఈ రీమేక్ కోసం వేరే స్ట్రగుల్ అవుతున్న డైరక్టర్ అనుకున్నారు. లాస్ట్ మినిట్ లో ఈ సీనియర్ హీరో బెజవాడ ప్రసన్న ని సీన్ లోకి తెచ్చారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ విషయం తెలిసిన అభిషేక్ అగర్వాల్ హర్ట్ అయ్యారని, అందుకే రైట్స్ ఇవ్వటం లేదనే ప్రచారం జరుగుతోంది. 

 ఇక పొరింజు మరియం జోస్ సినిమా మలయాళ బాక్స్ ఆఫీస్ వద్ద.. సూపర్ హిట్ గా నిలిచింది. పొరింజు మరియం జోస్ అనే సినిమాలో కూడా మూడు కీలక పాత్రలు ఉంటాయి.