బిగ్‌బాస్‌ నాల్గో సీజన్ హౌజ్‌లో మరోసారి డ్రామ్‌ పండించాడు నాగార్జున. అయితే ఈసారి ఊహించిన స్థాయిలో సస్పెన్స్ ని క్రియేట్‌ చేయడంలో విఫలమయ్యాడు. అభిజిత్‌ విషయంలో ప్రోమోలో ఉన్నంత కిక్‌ రియల్‌ ఎపిసోడ్‌లో లేదు. అభిజిత్‌ని బయటకు పంపించి చివర్లో నాగ్‌ ట్విస్ట్ ఇస్తాడని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఇంటి సభ్యులను ఈ వారంలో తాము చేసిన మిస్టేక్స్ చెప్పమని నాగ్‌ అన్నారు. 

వరుసగా అందరు తమ మిస్టేక్స్ చెప్పారు. చివర్లో అభిజిత్‌ వంతు వచ్చింది. ఆయన చెప్పడానికి ముందే నాగార్జున హౌజ్‌ గేడ్స్, డోర్స్ ఓపెన్‌ చేయమన్నారు. అంతా అభిజిత్‌ని ఆడుకోబోతున్నాడు, బయటకు పంపిస్తాడని ఊహించి కాస్త ఉలిక్కి పడ్డారు. అభిజిత్‌ తన మిస్టేక్స్ చెబుతూ, దెయ్యం గేమ్‌ సమయంలో మోనాల్‌ విషయం తనని బాధించిందన్నాడు. ఇద్దరు కలిసి మోనాల్‌ని ఏడిపించారనగానే బాధపడ్డానని తెలిపాడు అభిజిత్‌. `అందులో తప్పేముంది` అని నాగ్‌ అన్నాడు. `నేను
ఏడిపించలేదన్నాడు అభిజిత్‌. 

దీంతో నాగ్ వీడియో క్లిప్‌ చూపించాడు. అందులో తానే మోనాల్‌తో ఆ మాట అన్నాడు. మోనాల్‌ని కామెంట్‌ చేసిన క్లిప్‌ ఉంది. దీంతో ఒక్కసారిగా ఖంగుతిన్నాడు అభిజిత్‌. ఏం చేయలేక నాగ్‌కి సారీ చెప్పాడు. `నువ్వు చెప్పిన మాటలే.. బిగ్‌బాస్‌ టాస్క్ లో పంపించాడ`ని నాగ్‌ అన్నాడు. `ఆ విషయం నేను ఒప్పుకుంటాను సర్.. ఆ విషయంలో తాను రాంగ్‌` అని అభిజిత్‌ మోకాళ్ళ మీద పడి సారీ చెప్పాడు. 

నాగ్‌ స్పందిస్తూ, `అభిజిత్‌ నీకిది మొదటి సారి కాదు. ఎప్పుడూ ఇలానే చేస్తున్నావని, తప్పు చేస్తున్నావ్‌, సారీ చెబుతున్నావ్‌..` అంటూ ఫైర్‌ అయ్యాడు. ఆ విషయంలో నాదే మిస్టేక్‌ సర్‌.. అలా చేయకుండా ఉండాల్సింది. నేను తప్పు చేశాను` అని ఒప్పుకున్నాడు అభిజిత్‌. మొత్తంగా ఈ వారం తాను చేసిన తప్పులను మళ్ళీ చెప్పించాడు. దీంతో డోర్‌ క్లోజ్‌ చేయించాడు. తప్పు ఒప్పుకోకపోయి ఉంటే ఈ రోజు బయటకు పంపించేవాడినని చెప్పాడు నాగ్‌. ఇకపై నైనా సీరియస్‌గా, ఎవరి గేమ్‌ వాళ్ళు ఆడమని చెప్పాడు నాగ్‌. తనకు అంతా సమానమేనని, మీరంతూ సూపర్‌ 7 అని ప్రశంసించాడు.  మొత్తంగా ఎప్పటిలాగానే మరో డ్రామా క్రియేట్‌ చేసి తుస్సుమనిపించారు.