సోమవారం వచ్చిందంటే `బిగ్‌బాస్‌4` ఇంటిసభ్యుల్లో గుబులు పుడుతుంది. ఈవారం ఎలిమినేషన్‌కి సంబంధించిన నామినేషన్‌ ప్రారంభమవుతుంది. అయితే ఎపిసోడ్‌ మాత్రం చాలా వరకు బోరింగ్‌గానే సాగుతుంది. కానీ ఈ సోమవారం మాత్రం గేమ్‌ రక్తికట్టేలా ఉంది. ఇంటి సభ్యుల్లో హీట్‌ని పెంచేలా ఉందని అ్థమవుతుంది.  

తాజాగా సోమవారం ప్రసారమయ్యే ప్రోమోని విడుదల చేశారు. ఇందులో అమ్మా రాజశేఖర్‌, అభిజిత్‌ గొడవపడుతున్నారు. ఒకరిపై ఒకరు ఫైర్‌ అయ్యారు. గట్టిగా అరుచుకుంటున్నారు. వీరి గొడవని బట్టి చూస్తే, పని విషయంలో వీరిద్దరు గొడవపడుతున్నట్టు అర్థమవుతుంది. అభిజిత్‌ పని చేయడం లేదని, ఖాలీగా కూర్చుంటున్నారని అమ్మా రాజశేఖర్‌ ఫైర్‌ అవుతున్నారు. `నీవు ఎవరు అని.. ఎంత కష్టపడుతున్నామో తెలుసా? అని అమ్మా అనగా, `కష్టం అందరు పడుతున్నరు` అని అభిజిత్‌ మండిపడ్డాడు.. 

ఆ తర్వాత ఆయనే `కష్టం.. కష్టం.. ప్రతిసారి కష్టమా.. ఇంత కష్టం.. అంత కష్టం.. ` అన్నాడు. `మేమేడ కష్టపడుతున్నామ్‌.. ఛైర్‌లో కూర్చున్నా.. ` అని అమ్మా అనగా, `మీరెవరు డిసైడ్‌ చేయడానికి `అని ఆగ్రహంతో అభి వెళ్ళాడు. దీంతో సభ్యులంతా ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. మొత్తానికి ఈ ప్రోమో ఈ రోజు ఎపిసోడ్‌పై ఆసక్తిని క్రియేట్‌ చేస్తుందని చెప్పొచ్చు.