తొమ్మిదో వారం నామినేషన్‌లో మోనాల్‌ని నామినేట్‌ చేసి షాక్‌ ఇచ్చాడు అఖిల్‌. గేమ్‌పై దృష్టి లేదని, క్లారిటీ లేదని, అలాంటప్పుడు హౌజ్‌లో ఉండే అర్హత లేదని అఖిల్‌ స్పష్టం చేశారు. దీంతో మోనాల్‌ తీవ్రంగా హర్ట్ అయ్యింది. తన జడ్జ్ మెంట్‌ రాంగ్‌ అని వాపోయింది. అంతేకాదు ఇప్పుడు తన రూట్‌ మార్చింది. అఖిల్‌ని దూరం పెట్టడం ప్రారంభించింది. క్రమంగా అభిజిత్‌ చెంతకు చేరుతుంది. 

అఖిల్‌.. అడ్డంగా హ్యాండివ్వడంతో షాక్‌లోకి వెళ్ళిన మోనాల్‌ ఓదార్పు కోరుకుంది. అది అభిజిత్‌ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడు. అంతేకాదు మళ్ళీ మొదటి రోజులకు వెళ్లిపోయారీ మాజీ ప్రేమ పక్షులు. బుధవారం ఎపిసోడ్‌లో మోనాల్-అభిజిత్‌లు ఇద్దరూ సోఫాలో కూర్చుని ముచ్చట్లు పెట్టారు.  `అసలు నిన్ను ఎందుకు టార్గెట్ చేశారు అందరూ` అంటూ మోనాల్ ని ఉదార్చే ప్రయత్నం చేశాడు అభిజిత్‌. ఈ వారం వాళ్ళు నిన్ను ఎందుకు టార్గెట్‌ చేశారని అడిగాడు. 

అందుకు మోనాల్‌ స్పందిస్తూ, `వాళ్ల అభిప్రాయంలోనే నేను వీక్. గివ్ అప్ ఇస్తానని వాళ్ల ఉద్దేశం. అది నిజమే. నేను మిస్టరీ గర్ల్‌ని అందుకే` అని చెప్పింది మోనాల్. ఈ టైమ్‌లోనే పులిహోర కలపడం ప్రారంభించాడు అభిజిత్‌. వాళ్ళలా తాను చేయనని చెప్పాడు. `ఎంతైనా ఆడపిల్లవి కదా, అని చూడలేదు. నాకు అది నచ్చలేదు` అని ఆమెని ఓదార్చే ప్రయత్నం చేశాడు. మొత్తానికి మరోసారి కొత్త రొమాన్స్ కి తెరలేపారు.