బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ గేమ్‌ వారాలు పూర్తయ్యే కొద్ది, షో దగ్గరపడే కొద్ది ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఒక్కొక్కరు ఎలిమినేట్‌ అయ్యే కొద్ది మరింత రక్తికట్టిస్తుంది. ఆద్యంతం ఉత్కంఠకు గురి చేస్తుంది. పదకొండో వారంలో లాస్య ఎలిమినేట్‌ అయ్యారు. ఇక ఇప్పుడు పన్నెండో వారంలోకి షో అడుగుపెట్టింది. దీంతో మరింత ఉత్కంఠ నెలకొంది.

ఇప్పుడు పలు ప్రశ్నలు బిగ్‌బాస్‌కి ఎదురవుతున్నాయి. షోలో నిజంగా ఇంటి సభ్యుల పర్‌ఫెర్మెన్స్ ని బట్టి ఎలిమినేట్‌ జరుగుతుందా? లేక బిగ్‌బాస్‌ గేమ్‌ ప్రకారం జరుగుతుందా? అన్న సందేశాలు తలెత్తుతున్నాయి. మొదటి నుంచి గేమ్‌లో పెద్దగా యాక్టీవ్‌ లేని వారు ఇంకా కొనసాగుతున్నారు. బాగా గేమ్‌ ఆడేవారిని మాత్రం ఎలిమినేట్‌ అయి వెళ్ళిపోతున్నారు. 

మెహబూబ్‌ విషయంలో, అమ్మా రాజశేఖర్‌ విషయంలో అదే జరిగింది. కుమార్‌ సాయి టైమ్‌లో కూడా అలాంటి విమర్శలే వినిపించాయి. నిజానికి హౌజ్‌లో పూర్‌ పర్‌ర్మెన్స్ ఇచ్చేది ఎవరైనా ఉన్నారంటే అది అభిజిత్‌, మోనాల్‌. కానీ వీరిద్దరు ఎప్పుడైనా ఈజీగానే ఎలిమినేషన్‌ నుంచి బయటపడుతున్నారు. అసలు షోలో మోనాల్‌.. అఖిల్‌తో లవ్‌ ఎఫైర్‌ తప్ప గేమ్‌ పరంగా ఏనాడూ పెద్దగా ఆడింది లేదు. అభిజిత్‌ సైతం కొద్దిగా ఆడే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, ఆయన సిన్సియర్‌గా, కష్టపడి, జీల్‌తో ఆడింది లేదు. ఏదో నెట్టుకొస్తున్నాడనేలానే ఉంటుంది. మొన్న నామినేషన్‌లో ఇంటిసభ్యులు కూడా ఇదే చెప్పారు. ఇదేమి పట్టించుకోని నాగ్‌.. ప్రతిసారి అభిజిత్‌ని హైలైట్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ విషయంలో బిగ్‌బాస్‌ కావాలనే వీరిని కాపాడుతున్నాడనే సందేహం కలుగుతుంది. అభిజిత్‌ కొన్ని సినిమాల్లో హీరోగా నటించాడు. ఆయనకు కాస్త ఫాలోయింగ్‌ ఉంది. మిగిలిన వారితో పోల్చితే బాగా నోటెడ్‌ అయిన కంటెస్టెంట్‌ ఆయన ఒక్కడే. అలాగే మోనాల్‌ కూడా. ఆమె హీరోయిన్‌గా పలు సినిమాలు చేసింది. అంతేకాదు హౌజ్‌లో గ్లామర్‌ డాల్‌గా ఉంది. ముఖ్యంగా శని, ఆదివారాల్లో ఆమె రెడీ అయిన తీరు నిజంగానే ఆడియెన్స్ ని మత్తెక్కించేలా ఉంటుంది. అందాల ఆరబోతకు ప్రయారిటీ ఇస్తుంది. 

షోపై ఇంట్రెస్ట్ పెరగాలంటే, చూసేవారికి కనువిందునివ్వడం కోసం బిగ్‌బాస్‌ కావాలనే మోనాల్‌ని కాపాడుతున్నాడనే విమర్శ సోషల్‌ మీడియాలో వినిపిస్తున్నాయి. గేమ్‌ల పరంగా బాగా కష్టపడ్డవారికి మాత్రం అన్యాయమే జరుగుతుందని అంటున్నారు. అవినాష్‌ హౌజ్‌లో ఎంతో కామెడీని పంచుతున్నారు. అందరిని నవ్విస్తున్నాడు. కానీ అతనికి మాత్రం ఎలిమినేషన్‌ ప్రక్రియలో చివరి అంచు వరకు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా అతనిపైనే డౌట్‌ ఉంది. 

ఇక్కడ గేమ్‌ ఆడటం కంటే ప్రత్యేకమైన టీమ్‌లను ఆర్మీల పేరుతో ఏర్పాటు చేయించుకుని ఓట్లు వేయించుకున్నవారికే ఇక్కడ మనుగడ అని, లేదంటే ఇక ఎలిమినేషన్‌ తప్పదని ఇటీవల మూడు నాలుగు వారాల్లో జరిగిన పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. మరి ఈ లెక్కన ఈ షో విన్నర్‌ ఎవరనేదానిపై ఆసక్తి నెలకొంది. అంతా అభిజిత్‌ పేరు చెబుతున్నారు. ఆయన హౌజ్‌లో అంతగా యాక్టివ్‌గా లేకపోయినా ఆయనే విన్నర్‌ అనే వార్త హల్‌చల్‌ చేయడం వెనకాల బిగ్‌బాస్‌ ఉన్నాడనే అంటున్నారు. మరి ఇందులో వాస్తవాలేంటి? మున్ముందు ఏం జరుగుతుందనేది వేచి చూడాలి.