రీ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు...సౌత్ హ్యాండ్సమ్ హీరో అబ్బాస్. చాలా కాలం ఫారెన్ లో ఉండి వచ్చిన అబ్బాస్.. రీసెంట్ గా సొంత రాష్ట్రానికి చేరుకున్నాడు. వరుసగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు. ఈక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

మొదటి సినిమా ప్రేమ దేశం తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు తమిళ హీరో అబ్బాస్ . ఈసినిమాతో తిరిగి చూసుకోలేదున ఒక్క తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా అతనికి మంచి మార్కెట్ ఉండేది. లవర్ హీరోగా అబ్బాస్ చేసిన సినిమాలకు అమ్మాయిలు తెగ ఇష్టపడేవారు. అబ్బాస్ తో లవ్ లో పడేవారు. వరుసగా తమిళ, తెలుగు,మలయాళం సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేశాడు అబ్బాస్. ఆతరువాత పెద్దగా అవకాశాలు లేక సినిమాల నుంచితప్పకున్నాడు అబ్బాస్. 

 2015 నుంచి సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో కలిసి న్యూజిలాండ్ వెళ్ళిపోయాడు అబ్బాస్. అక్కడే రకరకాల జాబ్స్ చేసుకున్నాడు ఫ్యామిలీని పోషించాడు. ఇక చాలా కాలంగా అబ్బాస్ ఏమూపోయాడు అని వెతుకుతున్న అభిమానులు.. ఆడియన్స్ కోసం అబ్బాస్. రీసెంట్ గా చెన్నైకి వచ్చాడు. వచ్చీ రావడంతో.. సోషల్ మీడియా ఇంటర్వ్యూలలో మెరుస్తున్నాడు అబ్బాస్. తన కెరీర్ గురించి కొన్ని ఆసక్తి కరవిషయాలు పంచుకున్నాడు. ఈ ఇంటర్వ్యూలలో గతంలో జరిగిన అనేక ఆసక్తికర విషయాలని పంచుకుంటున్నాడు. 

ఈసందర్భంగా తన రీఎంట్రీ గురించి చెప్పిన అబ్బాస్..తనకు గతంలో హీరో విశాల్ తో ఏర్పడిన వివాదం గురించి కూడా మాట్లాడాడు. విశాల, అబ్బాస్ మధ్య ఓ వివాదం తలెత్తింది. అప్పట్నుంచి వీరిద్దరూ మాట్లాడుకోవడం కూడా మానేశారు కూడా. అయితే ఈ వివాదం గురించి తాజాగా అబ్బాస్ మాట్లాడాడు. అబ్బాస్ మాట్లాడుతూ.. గతంలో సినిమా ఇండస్ట్రీ అంతా ఒకే ఫ్యామిలీ అని చెప్పడానికి సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ప్రారంభించారు. నేను కూడా వేరే హీరోలు, నటులు అందరితో కలిసి తమిళ పరిశ్రమ తరపున ఆడాను. ఆ లీగ్ సెకండ్ సీజన్ లో నాకు విశాల్ కి మధ్య కొన్ని మనస్పర్థలు వచ్చాయి. విశాల్ నన్ను అన్న మాటలకు బాధపడి ఆ లీగ్ నుంచి తప్పుకున్నాను అన్నారు. 

అతను నా గురించి వేరేవాళ్లకు అబద్ధాలు చెప్పాడు. నా మీద నెగిటివ్ గా చెప్పేవాడు. దీంతో విశాల్ తో ఉన్న బంధం నాకు తెగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ విశాల్ తో మాట్లాడలేదు. ఎప్పటికైనా అతను చేసిన తప్పుని రియలైజ్ అవుతాడని భావిస్తున్నాను. ఒకవేళ ఇప్పుడు ఎదురుపడినా హాయ్ అని పలకరిస్తాను అంతేకాని ఇదివరకులా క్లోజ్ గా అయితే మాట్లాడలేను అని అబ్బాస్ అన్నారు. ప్రస్తుతం అబ్బాస్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమిళ ఫిల్మ్ సర్కిల్ లో ఈ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. మరి ఈ విషయంలో విశాల్ స్పందిస్తారా లేదా అనేది తెలియాలి.