Asianet News TeluguAsianet News Telugu

ఆమిర్ ఖాన్ ఇంట పెళ్లి సందడి, కూతురు ఐరా వెడ్డింగ్ డేట్ అనౌన్స్ చేసిన బాలీవుడ్ హీరో..

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్.. తాజాగా అభిమానులకు గుడ్ న్యూస్ వినిపించాడు. తన ఇంట్లో పెళ్ళి బాజాలు మోగనున్నట్టు తెలిపిన ఆమీర్.. కూతురు పెళ్ళికి సబంధించిన ఇంపార్టెంట్ అనౌన్స్ మెంట్ ను ఇచ్చారు.  

aamir khan shares daughter iras wedding date JMS
Author
First Published Oct 11, 2023, 3:29 PM IST

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్.. తాజాగా అభిమానులకు గుడ్ న్యూస్ వినిపించాడు. తన ఇంట్లో పెళ్ళి బాజాలు మోగనున్నట్టు తెలిపిన ఆమీర్.. కూతురు పెళ్ళికి సబంధించిన ఇంపార్టెంట్ అనౌన్స్ మెంట్ ను ఇచ్చారు.  

ఆమిర్ ఖాన్ ఇంట పెళ్లి భాజాలు మోగబోతున్నాయి. ఇప్పటికే ఆయన ఇంట్టో పెళ్లి సందడి స్టార్ట్ అయ్యింది. ఆమిర్ ఖాన్, ఆయన మాజీ భార్య రీనా దత్తా ల గారాల తనయ ఐరా ఖాన్ నిశ్చితార్థం 2022 నవంబర్ 18 లో జరిగిన సంగతి తెలిసిందే. ఎంతో కాలం నుంచి ఆమె ప్రేమిస్తున్న నుపుర్ శిఖర్ ను పెళ్ళాడబోతుంది ఐరా. ఇరుకుటుంబాలు ఒప్పుకోవడంతో.. నిశ్చితార్దం ఘనంగా జరిగింది. ఇక పెళ్ళికి సన్నాహాలు చేస్తున్నరు. 

నిశ్చితార్ధం తరువాత ఈసెలబ్రిటీలు ఇద్దరు కలిసి తిరగడం స్టార్ట్ చేశారు.ఫారెన్ టూర్లు.. వెకేషన్లతో పాటు.. హాట్ హాట్ ఫోటోలతో దర్శనం ఇచ్చారు. ఇక పెళ్ళి ఘడియలు రావడంతో.. వీరి పెళ్లికి సబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు వీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని ఎదరుచూస్తున్న ఫ్యాన్స్ కు ఆమీర్ స్వంగా గుడ్ న్యూస్ తెలిపారు. వీరి వివాహానికి సబంధించిన డేట్ ను అనౌన్స్ చేశారు. 

2024 జనవరి 3న కుమార్తె వివాహం జరగనున్నట్టు ఆయన ప్రకటించారు. న్యూస్18కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ఆమిర్ దీనిపై స్పందించారు. ‘‘ఐరా జనవరి 3న వివాహం చేసుకోబోతోంది. అతడి పేరు నుపుర్. అతడో లవ్ లీ బోయ్. ఐరా మానసికంగా ఇబ్బంది పడుతున్న సమయంలో ఆమెకు అండగా నిలిచాడు. ఆమెకు తోడుగా, మద్దతుగా నిలిచిన వ్యక్తి. వారు కలసి ఎంతో సంతోషంగా ఉన్నందుకు నాకు కూడా సంతోషంగా ఉంది. 

అంతే కాదు... వారు ఒకరిగురించి..ఒకరు బాగా అర్ధం చేసుకున్నారు.. వారు ఒకరి కోసం ఒకరు శ్రద్ధ తీసుకోగలరు అని ఆమిర్ ఖాన్ తెలిపారు. నుపుర్ తనకు కుమారుడితో సమానమని ఆమిర్ పేర్కొన్నారు. అతడ్ని తమ కుటుంబ సభ్యుడిగానే భావిస్తున్నట్టు చెప్పారు. నుపుర్ తల్లి ప్రీతమ్ జీ ఇప్పటికే తమ కుటుంబ సభ్యుల్లో ఒకరని ఆమీర్ ఖాన్ అన్నారు. వీరి పెళ్ళికి బాలీవుడ్ నుంచి భారీగా ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios