కరోనా మహహ్మారి కారణంగా వినోద పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దాదాపు 4 నెలలుగా థియేటర్లు మూత పడటంతో సినిమాల రిలీజ్‌లు ఆగిపోయాయి. దీంతో స్టార్ హీరోలు కూడా సాధారణ పరిస్థితులు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. ఈ లిస్ట్‌ లో మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్‌ ఖాన్‌ కూడా ఉన్నాడు. ఆమిర్‌ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం లాల్‌ సింగ్‌ చద్దా.

బయోపిక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ముందుగా 2020 క్రిస్ట్మస్‌కు రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ అప్పటికీ షూటింగ్ పూర్తి కాకపోవటంతో కాస్త ఆలస్యంగా రిలీజ్ చేయాలని భావించారు. ఈ లోగా లాక్‌ డౌన్‌ రావటంతో షూటింగ్‌కు బ్రేక్‌ పడింది. దీంతో తాజాగా కొత్త రిలీజ్‌ డేట్‌ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ముందుగా అనుకున్న డేట్‌కు ఏడాది ఆలస్యంగా 2021 క్రిస్ట్మస్‌కు రిలీజ్ చేసేందుకు ఫిక్స్‌ అయ్యారు చిత్రయూనిట్‌.

ఆమిర్‌ ఖాన్‌కు క్రిస్ట్మస్‌ చాలా లక్కీ. ఆయన క్రిస్ట్మస్‌ సందర్భంగా రిలీజ్ చేసిన 3 ఇడియట్స్‌, పీకే, ధూమ్‌ 3, దంగల్ సినిమాలతో చాలా సినిమాలు అదే రోజున రిలీజ్‌ అయి ఘన విజయం సాధించాయి. లాల్‌ సింగ్‌ చద్దా సినిమా విషయానికి వస్తే ఈ మూవీ టామ్‌ హ్యాంక్స్‌ నటించిన ఫారెస్ట్‌ గంప్‌ ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ చండిఘర్‌, కోల్‌కతా ప్రాంతాల్లో కొంత భాగం షూటింగ్ చేశారు.

ఆమిర్‌ ఖాన్‌, కరీనా కపూర్‌,  మోనా సింగ్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ఆమిర్‌ ఖాన్‌ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ప్రీతమ్ సంగీతమందిస్తున్నాడు.