సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటోషూట్ లతో తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్. ఈమె నటిగా కెమెరా ముందుకు రాబోతుందనే వార్తలు వినిపించాయి. కానీ ఐరా డైరెక్షన్ వైపు అడుగులు వేస్తోంది.

అయితే ఆమె డైరెక్టర్ చేయబోయేది ఫీచర్ ఫిల్మ్ కాదు.. ఓ స్టేజ్ డ్రామాకి ఆమె దర్శకత్వ బాధ్యతలు చేపడుతోంది. గ్రీక్‌ ట్రాజిడీ డ్రామా 'మేడియా'ను డైరెక్ట్‌ చేయబోతోంది ఐరా. ఒరిజినల్ కథ 431 బీసీ కాలానికి చెందినదని.. తన ప్రెజంటేషన్ లో కొన్ని మార్పులు ఉంటాయని చెప్పింది ఐరా. ఫ్యూచర్ లో సినిమాను కూడా డైరెక్ట్ చేస్తానేమో చెప్పలేను అంటూ వెల్లడించింది.

ఈ స్టేజ్ డ్రామా షూటింగ్ జరుగుతున్న సందర్భంగా తీసిన ఫోటోని ఐరా తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. తన స్నేహితురాలితో కలిసి కార్ లో కూర్చొని ఉండగా.. ఆమె తనవైపు తిరిగి.. హే ఐరూ నీ కెరీర్ మొదలైందనే విషయం నేను ఇప్పుడే రియలైజ్ అయ్యాను అంటూ చెప్పిందట. తను కూడా ఈ విషయాన్ని గ్రహించినట్లు చెప్పుకొచ్చింది ఐరా. ఈ స్టేజ్ డ్రామాని తెరకెక్కించడం కోసం ఓ ప్రొడ‌క్ష‌న్ కంపెనీని ప్రారంభించింది ఐరా.

ఈ థియేట‌ర్ ప్రొడ‌క్ష‌న్ పేరు ;యూరిపైడ్స్ మీడియా;. ఈ ఏడాది చివ‌రి నాటికి దేశ‌వ్యాప్తంగా ఎంచుకున్న థియేట‌ర్ల‌లో ఐరా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న స్టేజీ డ్రామాను ఈ కంపెనీ ప్లే చేయ‌నుంది.