బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ చాలా కాలంగా సంగీతకారుడు మిశాల్ కిర్పలానితో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఈ విషయంపై ఇరా ఖాన్ స్పందించింది. 

ఇన్స్టాగ్రామ్ లో 'ఆస్క్ మీ ఎనీథింగ్' అనే సెషన్ లో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఇరా ఖాన్ సమాధానాలు చెప్పింది. ఈ క్రమంలో ఓ అభిమాని ఎవరితోనైనా డేటింగ్ లో ఉన్నారా..? అని ప్రశ్నించగా.. దానికి ఇరాఖాన్ ఓ ఫోటోతో బదులిచ్చింది.

మిశాల్ ని కౌగిలించుకున్న ఉన్న ఫోటో షేర్ చేసి తన ప్రేమని కన్ఫర్మ్ చేసింది.  గత కొంతకాలంగా డేటింగ్ లో ఉన్న ఈ జంట తమకి సంబంధించిన ఫోటోలను సోషల్  మీడియాలో షేర్ చేశారు.

ఇక ఇరా కెరీర్ విషయానికొస్తే.. తండ్రిలానే నటనలో రాణిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఇరా ఖాన్ కి నిర్మాణంపై ఆసక్తి ఉందని అమీర్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.