అమీర్ ఖాన్ 30 ఏళ్లలో చాలా క్లాసిక్ సినిమాలు చేశాడు. కానీ ఆయన సింపుల్ లైఫ్ స్టైల్, ఎక్కువగా బయటకు రాకపోవడం వల్లే ఆయన ఇంటి ముందు ఫ్యాన్స్ ఉండరని చెప్పుకోవచ్చు.
అమీర్ ఖాన్ 30 ఏళ్ల కెరీర్ లో చాలా క్లాసిక్ సినిమాలు చేశాడు. ఆయన ఎప్పుడూ కొత్త కథలతో సినిమాలు చేస్తాడు. సమాజానికి ఉపయోగపడే సినిమాలు చేస్తాడు. `అందాజ్ అప్నా అప్నా`, `సర్ఫరోష్`, `రంగ్ దే బసంతి`, `తారే జమీన్ పర్`, `దంగల్` లాంటి సూపర్ హిట్ సినిమాలు చేశాడు. కానీ `పీకే` లాంటి సినిమాలకు చాలా వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. `లాల్ సింగ్ చడ్డా` సినిమాని బాయ్ కాట్ చేయమన్నారు.
అమితాబ్ బచ్చన్, షారూఖ్ లాగా అమీర్ ఇంటి ముందు ఎందుకు ఫ్యాన్స్ ఉండరు
అమితాబ్ బచ్చన్, షారుఖ్, సల్మాన్ లతో పోలిస్తే అమీర్ ఖాన్ కి ఎక్కువ వ్యతిరేకత ఉంది. అందుకే ఆయన ఇంటి ముందు ఫ్యాన్స్ ఉండరని టాక్. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇళ్ల ముందు రోజూ ఫ్యాన్స్ ఉంటారు. కానీ అమీర్ ఖాన్ ఇంటి ముందు ఎవరూ ఉండరు. దీనికి కారణం ఆయన ఎక్కువగా బయటకు రాడు. ఆయన లైఫ్ ని ప్రైవేట్ గా ఉంచుకుంటాడు. అమీర్ ఖాన్ సింపుల్ గా ఉంటాడు. సాధారణ బట్టలు వేసుకుంటాడు. తన ఇంటి గురించి, పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువగా బయట పెట్టడు. అందుకే ఆయన ఇంటి ముందు ఫ్యాన్స్ ఉండరని అంటుంటారు.
అమీర్ ఖాన్ ఫన్నీ స్టోరీ
దీనిపై ఓ ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్ స్పందించారు. ఆయన ఇంట్లో రిపేర్స్ జరుగుతున్నప్పుడు వేరే ఇంటికి మారాడు. అదే ఏరియాలో జాకీ ష్రాఫ్ ఇల్లు ఉంది. ఒకరోజు ఆయన ఇంటికి వెళ్తుంటే గేట్ దగ్గర చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయనకి ఆశ్చర్యం వేసింది. కానీ ఆ ఫ్యాన్స్ అంతా టైగర్ ష్రాఫ్ కోసం వచ్చారని తెలిసిందంటూ చెప్పి షాకిచ్చాడు మిస్టర్ పర్‌ఫెక్ట్.
అమీర్ ఖాన్‌కి వరుస ఫెయిల్యూర్స్
అమీర్ ఖాన్ కి హిట్ పడక చాలా రోజులవుతుంది. `పీకే` తర్వాత ఆయనకు సక్సెస్ రాలేదు. చాలా సినిమాలు చేసినా డిజప్పాయింట్ చేశాయి. ఇటీవల `సితారే జమీన్ పర్` మూవీలో నటించారు. ఈ చిత్రం ఫర్వాలేదనిపించుకుంది. మరోవైపు రజనీకాంత్ `కూలీ`లో నటించాడు. ఇందులో గెస్ట్ రోల్ చేయగా దానికి విశేష స్పందన లభించింది. ఇప్పుడు అమీర్ `లాహోర్ 1947` చిత్రంలో నటిస్తున్నారు.
