దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఇప్పుడు రజనీకాంత్‌తో `కూలీ` మూవీని రూపొందిస్తున్నారు. ఇందులో భారీ స్టార్ కాస్టింగ్ నటిస్తోంది. అమీర్ ఖాన్ కూడా కనిపిస్తారట. కానీ త్వరలో అమీర్‌తోనే మూవీ ప్లాన్ చేస్తున్నారు లోకేష్.
`సితారే జమీన్ పర్` చిత్రంతో రాబోతున్నారు బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్. దీంతోపాటు ఆయన సౌత్‌లో `కూలీ` చిత్రంలో గెస్ట్ రోల్ చేస్తున్నారు. సినిమాని మలుపు తిప్పే పాత్రలో ఆయన కనిపిస్తారట.
లోకేష్ కనగరాజ్‌తో సూపర్ హీరో మూవీ
ఈ క్రమంలో ఇప్పుడు అమీర్ ఖాన్ ఓ సూపర్ హీరో మూవీ చేయబోతున్నారట. తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తారట. పిటిఐ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమీర్ ఈ విషయం చెప్పారు.
లోకేష్ తో కలిసి ఓ సూపర్ హీరో సినిమా చేస్తున్నట్టు, వచ్చే ఏడాది ద్వితీయార్థంలో షూటింగ్ మొదలవుతుందని ఆయన తెలిపారు. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన 'పీకే' సినిమాకి సీక్వెల్ వస్తుందన్న వార్తలను అమీర్ ఖండించారు. హిరానీతో కలిసి దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ చేస్తున్నట్టు చెప్పారు.
`పీకే 2` కాదు దాదాసాహెబ్‌ఫాల్కే బయోపిక్
'పీకే 2' వార్తలు కేవలం పుకార్లేనని, దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ కోసం పనిచేస్తున్నామని అమీర్ స్పష్టం చేశారు. చాలా కాలంగా తాను కలలు కంటున్న `మహాభారతం` ప్రాజెక్ట్ గురించి కూడా ఆయన మాట్లాడారు.
`మహాభారతం` సినిమా తీయడం అంటే కేవలం సినిమా తీయడం కాదని, ఒక తపస్సు లాంటిదని ఆయన అన్నారు. ఆ ప్రాజెక్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నానని, కానీ అది సాధ్యమవుతుందో లేదో తెలియదని ఆయన చెప్పారు.
