మణిరత్నం దర్శకత్వం వహించిన ‘థగ్ లైఫ్’ సినిమా ఈ గురువారం విడుదలైంది. అయితే ఈ మూవీకి స్టార్‌ హీరోయిన్‌ కూతురు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేయడం విశేషం. 

ఖుష్బు సినీ ప్రయాణం

1980లలో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసిన ఖుష్బు, 1989లో విడుదలైన ‘వరుషం 16’ చిత్రం ద్వారా తమిళ సినీ పరిశ్రమలో హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. చిరంజీవి, వెంకటేష్‌, రజనీ, కమల్, ప్రభు, విజయకాంత్, సత్యరాజ్ వంటి అగ్ర హీరోల సరసన నటించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తున్నారు.

భర్త దర్శకుడు సుందర్.సితో కలిసి ‘అవ్ని సినీమాక్స్’ అనే నిర్మాణ సంస్థను కూడా నడుపుతున్నారు. టీవీ సీరియల్స్‌ను నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తూ, నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల, సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘అన్నాత్తే’లోనూ, విజయ్ సరసన ‘వారసుడు’లోనూ నటించారు ఖుష్బు. మరోవైపు తెలుగులో `జబర్దస్త్` కామెడీ షోకి ఆమె జడ్జ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. 

ఖుష్బు చిన్న కూతురు అనందిత

 2000 సంవత్సరంలో దర్శకుడు సుందర్.సి ని ప్రేమించిన పెళ్లి చేసుకున్నారు ఖుష్బు. వీరికి ఇద్దరు కుమార్తెలు - అవంతిక, అనందిత. పెద్ద కూతురు అవంతిక విదేశాల్లో ఫిల్మ్ కోర్స్ చేస్తున్నారు. చిన్న కూతురు అనందిత మేకప్, బ్యూటీ రంగంలో పనిచేస్తున్నారు. మేకప్, బ్యూటీ రంగంలోకి అడుగుపెట్టాలనుకునేవారికి శిక్షణ ఇచ్చేందుకు మేకప్ అకాడమీని కూడా నడుపుతున్నారు.

అసిస్టెంట్ డైరెక్టర్ అయిన అనందిత సుందర్

మేకప్, బ్యూటీ రంగంలో పనిచేస్తున్న అనందిత ఇప్పుడు సినీ రంగంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా అడుగుపెట్టారు. మణిరత్నం దర్శకత్వం వహించిన ‘థగ్ లైఫ్’ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేయడం విశేషం . ‘థగ్ లైఫ్’ సినిమా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న తరుణంలో, థియేటర్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ల జాబితాలో అనందిత పేరు ఉన్న ఫోటోను ఖుష్బు సోషల్ మీడియాలో షేర్ చేశారు.


కూతురు అనందిత గురించి ఖుష్బు భావోద్వేగ పోస్ట్

“ఒక తల్లిగా, మణిరత్నం సినిమాలో ఆయన శిష్యురాలిగా నా కూతురు పేరును చూడటం చాలా గర్వంగా ఉంది. కాలు విరిగిన కారణంగా ఆమె ఆ సినిమాకి పూర్తిగా పనిచేయలేకపోయింది. అయినప్పటికీ, తన వంతు కృషి చేసింది. 

మణిరత్నం నుంచి ఆమె నేర్చుకున్న విషయాలు జీవితాంతం ఉపయోగపడతాయి. ఆ అనుభవం నిజంగా విలువైనది. మీ ఉదార స్వభావానికి, ఆమె పేరును స్క్రీన్‌పై చూపించినందుకు ధన్యవాదాలు సార్” అని రాసుకొచ్చారు ఖుష్బు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌ అవుతుంది. 

అయితే అవంతిక తండ్రి సుందర్‌ సి దర్శకుడు. కావాలనుకుంటే ఆయన సినిమాలకే అసిస్టెంట్‌గా పనిచేయోచ్చు, కానీ సొంత తండ్రిని పక్కన పెట్టి మణిరత్నం చిత్రానికి ఆమె అసిస్టెంట్‌గా పనిచేయడం విశేషం. 

View post on Instagram