Asianet News TeluguAsianet News Telugu

“కేజీఎఫ్-2” టీమ్ కు క్షమాపణ చెప్పిన అమీర్ ఖాన్

ఈ సినిమా మొదటి భాగం “కేజీఎఫ్”కు వచ్చిన రెస్పాన్స్, “కేజీఎఫ్-2″కు ఉన్న క్రేజ్ అలాంటిది కావటంతో ఎవరూ పోటీకు పెట్టుకోలేదు. అయితే అందరికీ షాకిస్తూ ఓ స్టార్ హీరో యష్ తో తలపడడానికి రెడీ అయ్యాడు.

Aamir Khan issues an apology for KGF Team
Author
Mumbai, First Published Nov 24, 2021, 12:59 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

సినిమా ప్రియులు చాలా మంది ఎంతో ఆసక్తిగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిత్రాల్లో “కేజీఎఫ్-2” ఒకటి. ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా, సంజయ్ దత్ , శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్ , అనంత్ నాగ్, ప్రకాష్ రాజ్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్, కార్తీక్ గౌడ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. గత ఏడాది కాలం నుంచి ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం  ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. కరోనా కారణంగా ఇప్పటికే సినిమా విడుదల చాలా ఆలస్యం అయ్యింది. కొన్ని రోజుల క్రితం మేకర్స్ ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 14న సినిమాను విడుదల చేయబోతున్నట్టుగా ప్రకటించారు. సోలోగా రావాలనే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ “కేజీఎఫ్-2″కు పోటీగా వచ్చే ధైర్యం ఎవ్వరూ చేయరని అంతా భావించారు. ఈ సినిమా మొదటి భాగం “కేజీఎఫ్”కు వచ్చిన రెస్పాన్స్, “కేజీఎఫ్-2″కు ఉన్న క్రేజ్ అలాంటిది కావటంతో ఎవరూ పోటీకు పెట్టుకోలేదు. అయితే అందరికీ షాకిస్తూ ఓ స్టార్ హీరో యష్ తో తలపడడానికి రెడీ అయ్యాడు.
 
మాగ్నమ్ ఓపస్ “కేజీఎఫ్-2″తో బాలీవుడ్ బిగ్ మూవీ క్లాష్ కాబోతోంది. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ “లాల్ సింగ్ చద్దా” కూడా ఏప్రిల్ 14న విడుదలకు రెడీ అయ్యింది. “లాల్ సింగ్ చద్దా” చిత్రంలో కరీనా కపూర్ ఖాన్, సౌత్ నటుడు నాగ చైతన్య కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ముందుగా ఈ చిత్రం ఫిబ్రవరి 2022 లో విడుదల కాబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. కానీ ఈ సినిమా పనులు ఆ సమయానికి పూర్తయ్యే సూచనలు కన్పించకపోవడంతో ‘లాల్ సింగ్ చద్దా’ను ఏప్రిల్ 2022కి వాయిదా వేశారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ మేకర్స్ ఓ పోస్టర్ ను విడుదల చేశారు.  దాంతో బాక్స్ ఆఫీస్ వద్ద “కేజీఎఫ్-2”, “లాల్ సింగ్ చద్దా” మధ్య బిగ్ క్లాష్ తప్పదని ఫిక్సైపోయింది. అమీర్ ఖాన్ ఈ విషయమై “కేజీఎఫ్-2” టీమ్ కు క్షమాపణ చెప్పారు.

అమీర్ ఖాన్ మాట్లాడుతూ...“ నేను ఎప్పుడూ వేరే నిర్మాత ఫైనలైజ్ చేసిన రిలీజ్ డేట్ ని తీసుకోను. సాధారణంగా నేను ఓ ప్లాన్ ప్ర‌కారం ముందుకు వెళుతూ అనుకున్న ఔట్‌పుట్ వ‌చ్చేలా చూసుకుంటాను. లాల్ సింగ్ చ‌ద్దా విషయంలో క‌రోనా కార‌ణంగా మా ప్లాన్స్ అన్నీ పాడ‌య్యాయి. ముఖ్యంగా క‌రోనా సెకండ్ వేవ్‌ కార‌ణంగా, సినిమా షూటింగ్ వాయిదా ప‌డటం జరిగింది. ఆ షూటింగ్‌ను పూర్తి చేస్తూనే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు చేస్తూ వ‌చ్చాం. ఏదో అవ‌స‌రంగా సినిమాను పూర్తి చేసేసి విడుద‌ల చేయాల‌నే తత్వం నాది కాదు. ప్ర‌స్తుతం లాల్‌సింగ్ చ‌ద్దా వి.ఎఫ్‌.ఎక్స్ ప‌నులు జ‌రుగుతున్నాయి. అవి పూర్త‌య్యేలోపు లేటు కావ‌చ్చు. అదీ కాకుండా లాల్ సింగ్ చ‌ద్దా మూవీలో నేను సిక్కు యువ‌కుడిగా క‌నిపిస్తాను. 

నేను అలాంటి పాత్ర చేయ‌డం ఇదే తొలిసారి. కాబ‌ట్టి..సిక్కుల పండ‌గ రోజైన బైసాంకి రోజునే నా సినిమాను విడుద‌ల చేస్తే బావుంటుంద‌నిపించింది. అందుక‌నే ఏప్రిల్ 14న మా సినిమాను విడుద‌ల చేయాల‌నుకున్నాం. అదే రోజున విడుద‌లవుతున్న పాన్ ఇండియా మూవీ KGF Chapter 2 నిర్మాత‌ల‌కు ఈ సంద‌ర్భంగా నేను సారీ చెప్పాల‌నుకుంటున్నాను.నేను వేరే ప్రొడ్యూస‌ర్ ఫిక్స్ అయిన రిలీజ్ డేట్‌లో నా సినిమాను ఎప్పుడూ విడుద‌ల చేయ‌లేదు. కానీ ఈసారి అలా కుదిరింది. త‌ప్ప‌లేదు’’ అని విజ‌య్ కిర‌గందూర్‌కి సారీ చెప్పి త‌న హుందాత‌నాన్ని మ‌రింత పెంచుకున్నారు ఆమిర్ ఖాన్. 

Also read సల్మాన్, అక్షయ్, రజినీ... అందరూ ప్రభాస్ వెనుకే... వంద కోట్లు కాదు, ఆయన ప్రెజెంట్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాకే!
 
ఈ చిత్రం టామ్ హాంక్స్ నటించిన 1994 హాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'ఫారెస్ట్ గంప్‌'కి రీమేక్. ఇంతకుముందు అమీర్‌తో కలిసి 'సీక్రెట్ సూపర్‌స్టార్‌' (2017) తీసిన అద్వైత్‌ చందన్‌ ఈ హిందీ వెర్షన్‌కు దర్శకత‍్వం వహించారు. ఈ సినిమా అమీర్‌ ఖాన్ ప్రొడక్షన్స్‌లో బ్యానర్‌లో రానుంది. అమీర్‌ ఖాన్‌, కరీనా కపూర్‌తో ఉన్న కొత్త పోస్టర్‌ను ట్విటర్‌లో షేర్‌ చేసింది ప్రొడక్షన్‌ బ్యానర్‌.  ఈ చిత్రం 2021 క్రిస్మస్‌కు విడుదల కావాల్సింది. అయితే కొవిడ్‌ వల్ల షూటింగ్ నిలిపివేయడంతో ఆలస్యమైంది. టీమ్‌ ప్రొడక్షన్‌ సెప్టెంబర్‌లో పూర్తైంది. విన్‌స్టన్‌ గ్రూమ్‌ 1986 నవల ఆధారంగా 'ఫారెస్ట్‌ గంప్‌' ని తెరకెక్కించారు. 'లాల్‌ సింగ్‌ చద్దా' సినిమాకు ఎరిక్‌ రోత్‌, రచయిత అతుల్‌ కులకర్ణి స్క్రీన్‌ప్లే అందించారు. ఈ చిత్రంలో నాగ చైతన్య, మోనా సింగ్‌ తదితరులు కూడా నటించారు. 

Also read ఆర్.ఆర్. ఆర్, పుష్ప ...దుబాయి ఈవెంట్స్ కాన్సిల్, కారణం
 

Follow Us:
Download App:
  • android
  • ios