Asianet News TeluguAsianet News Telugu

అర్జెంటుగా ఆ రూమర్ ని ఖండించిన ‘ఆది పురుష్’ టీమ్

బాలీవుడ్ బోల్డ్ భామ ఊర్వశి ప్రభాస్ ఆదిపురుష్ సీతగా ఎంపిక చేసినట్లుగా వార్తలొస్తున్న వేళ ఆదిపురుష్ టీం లైన్ లోకొచ్చి మేము ఆదిపురుష్ సినిమా కోసం ప్రభాస్ కి జోడిగా ఇంకా హీరోయిన్ ని ఎంపిక చెయ్యలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న పేర్లతో మాకు సంబంధం లేదని తేల్చి చెప్పింది.

Aadipurush team reacted on Rumors about Movie Heroine
Author
Hyderabad, First Published Sep 10, 2020, 8:34 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp


ప్రభాస్‌ డైరక్ట్ గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ నటిస్తున్న చిత్రం 'ఆది పురుష్‌'. ఆయన నటిస్తున్న 22వ చిత్రమిది. ఓమ్‌ రౌత్ తెరకెక్కిస్తోన్న ఈ పౌరాణిక చిత్రాన్ని రామాయణం నేపథ్యంలో 3డీలో భారీ బడ్జెట్‌తో టీ సిరీస్ నిర్మిస్తోంది. ఇక ఇందులో ప్రభాస్ రాముడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా కనిపించనున్నారనేది ఫిక్సైంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో సీత పాత్రకు గానూ మాజీ మిస్ ఇండియా ఊర్వశి రౌటెలాను సంప్రదించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. 

సీత పాత్రకు ఆమె బాగా సరిపోతుందని భావించిన దర్శకుడు ఊర్వశితో మాట్లాడుతున్నట్లు మీడియాలో భారీ ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ వార్త కాస్త వైరల్‌గా మారి, చిత్ర యూనిట్‌ వద్దకు వెళ్లింది. దీంతో చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది.

”రాముడిగా ప్రభాస్‌ని, రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్‌ని మాత్రమే మేము ఫైనల్‌ చేశాము. మిగిలిన పాత్రాధారులకు సంబంధించిన సంప్రదింపులు జరుగుతున్నాయి. ఊర్వశిని మేము సంప్రదించ లేదు” అని నిర్మాతలు ఓ ప్రకటనను విడుదల చేశారు. కాగా తెలుగు, హిందీలో తెరకెక్కిస్తోన్న ఈ మూవీని పలు భాషల్లో విడుదల చేయనున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.

అదే సమయంలో ఈ సినిమా గ్రాఫిక్స్ బడ్జెట్ కూడా ఓ రేంజిలో ఉండబోతోందని అంచనా వేస్తున్నారు. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాకు 250 కోట్ల భారీ బడ్జెట్ ని గ్రాఫిక్స్ కోసం పెట్టనున్నారట. అంతా గ్రీన్ మ్యాట్ లోనే షూటింగ్ చేస్తారట. ఈ సినిమాలో ఎక్కువ శాతం విజువల్ ఎఫెక్ట్ తో నిండి ఉంటాయి. అవతార్ స్దాయిలో గ్రాఫిక్స్ ఉంటాయని, లొకేషన్స్ అన్ని విజువల్ గ్రాఫిక్స్ అని తెలుస్తోంది. దాంతో ఈ సినిమా బడ్జెట్ 500 కోట్లు వరకూ అవుతుందని, త్రీడిలో తీస్తున్న సినిమా,అదీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నది కావటంతో గిట్టుబాటు అవుతుందని చెప్తున్నారు. ఈ చిత్రం దర్శకుడు విజువల్ ఎఫెక్ట్స్ లో ఎక్సపర్ట్ అని తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios