Asianet News TeluguAsianet News Telugu

ఆదికేశవ, కోటబొమ్మాళి OTT రిలీజ్ డిటేల్స్

ఆదికేశవతో పోలిస్తే కోటబొమ్మాలికి బుకింగ్స్   బాగున్నాయి. ఈ సినిమా బడ్జెట్ కి, వస్తున్న కలెక్షన్స్ కి నిర్మాతల నుంచి మంచి స్పందన వస్తోంది.  

 

 

Aadikeshava and Kota Bommali PS OTT streaming details jsp
Author
First Published Nov 27, 2023, 10:48 AM IST

 “ఆదికేశవ”, “కోట బొమ్మాళి పిఎస్” నవంబర్ 24న విడుదల అయ్యి థియేటర్లలో పెద్దగా సందడి చేయలేకపోయిన సంగతి తెలిసిందే.  ఆదికేశవ చిత్రం ఇనానమస్ గా డిజాస్టర్ టాక్ వచ్చింది. కోట బొమ్మాళి ఓకే అనిపించుకుంది కానీ స్టార్ డమ్ లేకపోవటంతో కలెక్షన్స్ పికప్ అవటం లేదు. దాంతో చాలా మంది  ఈ రెండు సినిమాలు ఓటిటి స్ట్రీమింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా లు ఎప్పుడు స్ట్రీమ్ అవుతాయి ? 

వివరాల్లోకి వెళితే... పంజా వైష్ణవ్ తేజ్, శ్రీ లీల హీరో హీరోయిన్లుగా నటించిన ఆదికేశవ  సినిమాకి ఆది నుంచి బజ్ రాలేదు. ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ చిత్రం పైన ఎవరికీ పెద్దగా ఆశలు లేవు. నిర్మాత ఈ సినిమా గనరించి ఎంత కాన్ఫిడెంట్ కా చెప్పినా  ఫస్ట్ లుక్.. పోస్టర్.. టీజర్ ట్రైలర్ అన్ని కూడా ఈ చిత్రంపై ప్రేక్షకులలో నెగిటివ్ విబ్సే క్రియేట్ చేస్తూ వచ్చాయి.   ట్రైలర్ చూడగానే  ఈ సినిమా పరమ రొటీన్ మాస్ సినిమా అని అర్దం కావటంతో  ప్రీ రిలీజ్ బుకింగ్ కూడా చాలా దారుణంగా ఉంది. రిలీజ్ అయ్యాక అందరూ అనుకున్నట్టే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.

 ఈ సినిమాతో పాటు విడుదలైన మరో తెలుగు సినిమా కోట బొమ్మాలి పిఎస్.  ఈ చిత్రం గురించి చెప్పుకోవటానికి లింగిడి లింగిడి పాట ఉంది. ఈ పాట యూట్యూబ్లో విడుదలైన దగ్గర నుంచి ఈ సినిమాపై బజ్ మొదలైంది. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం మలయాళ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ “నాయట్టు” మూవీకి రీమేక్. రిలీజ్ అయ్యాక ఆదికేశవ సినిమా కన్నా ఈ చిత్రం చాలా బెటర్ అన్నారు కానీ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అనలేదు.  తేజ మార్ని దర్శకత్వం వహించిన ఈ చిత్రం టాక్ పరంగా ఓకే అనిపించుకున్నా  కలెక్షన్స్ పరంగా మాత్రం స్పీడు లేదు.  ఇక ఈ రెండు చిత్రాలు ఓటిటిలు రిలీజ్ కు ముందే లాక్ అయ్యాయి. వెనక పెద్ద బ్యానర్స్ ఉండటం కలిసొచ్చింది.

 ఆదికేశవ మూవీని కాస్ట్లీ ఓటీటీ నెట్ ఫిక్స్ సొంతం చేసుకోగా, కోట బొమ్మాలి మూవీని   రీజనల్ ఓటీటీ ఆహా లో స్ట్రీమింగ్ కానుంది. ఈ రెండు సినిమాలు కూడా డిసెంబర్ చివరి వారంలో ఓటీటిలో రిలీజ్ కానున్నాయని సమాచారం. మరి  ఆదికేశవ, కోట బొమ్మలి పిఎస్ సినిమాలకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios