యువ హీరో ఆది.. సాయి కుమార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కెరీర్ ఆరంభంలో ఆదికి ప్రేమ కావాలి, లవ్లీ లాంటి హిట్స్ పడ్డాయి. కానీ ఆ తర్వాతే ఆది కెరీర్ గాడి తప్పింది.
యువ హీరో ఆది.. సాయి కుమార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కెరీర్ ఆరంభంలో ఆదికి ప్రేమ కావాలి, లవ్లీ లాంటి హిట్స్ పడ్డాయి. కానీ ఆ తర్వాతే ఆది కెరీర్ గాడి తప్పింది. వరుసగా ఫ్లాపులు ఎదురుకావడంతో రేసులో వేనుకబడిపోయాడు. ప్రస్తుతం ఆది వరుసగా చిత్రాలు చేస్తున్నప్పటికీ ఏది వర్కౌట్ కావడం లేదు.
ఆది సాయి కుమార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'తీస్ మార్ ఖాన్'. కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కళ్యాన్జీ గోగణ దర్శకుడు. ఆదికి జోడిగా బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలయింది.
టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆది సాయికుమార్ పోలీస్ గెటప్ లో కనిపిస్తున్నాడు. నగరంలో జరుగుతున్న వరుస కిడ్నాప్ ల మిస్టరీ ఏంటనేది టీజర్ లో ఉత్కంఠగా చూపించారు. ఇక ఆది యాక్షన్ సన్నివేశాలు మంచి అటెన్షన్ తీసుకుంటున్నాయి. మనం ఆపాలనుకున్నంత పవర్ మన దగ్గర ఉన్నా..మనం ఆపలేనంత పవర్ వాడి దగ్గర ఉంది సర్' అంటూ పోలీసులు చెప్పే డైలాగ్ ఆది పాత్రని తెలియజేస్తోంది.
ఇక ఆది, పాయల్ రాజ్ పుత్ మధ్య రొమాన్స్ డోస్ బాగానే ఉన్నట్లు ఉంది. పాయల్ రాజ్ పుత్ తడి అందాలు ఆరబోస్తూ టీజర్ లో కనిపించింది. వీరిద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ యూత్ ని ఆకర్షించే విధంగా ఉన్నాయి. ఇలాంటి బోల్డ్ సీన్స్ పాయల్ కి కొత్తేమి కాదు. హాట్ గ్లామర్ తోనే పాయల్ రాజ్ పుత్ యువతలో క్రేజ్ తెచ్చుకుంది. తీస్ మార్ ఖాన్ టీజర్ పై మీరూ ఓ లుక్కేయండి.

