Asianet News TeluguAsianet News Telugu

#Aadikeshava: OTT రిలీజ్ డేట్, ప్లాట్ ఫామ్

'ఆదికేశవ' చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్ నిర్మాణ సంస్థలపై సూర్యదేవర నాగ వంశీ, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి ఎస్. సాయి సౌజన్య నిర్మించారు. 

Aadi Keshava OTT Release Date and Platform jsp
Author
First Published Nov 24, 2023, 3:12 PM IST | Last Updated Nov 24, 2023, 3:12 PM IST


మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్(Vaishnav Tej), లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీల(Sreeleela) జంటగా వచ్చిన లేటెస్ట్ మూవీ ఆదికేశవ(Aadikeshava). కొత్త దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి (Srikanth n reddy) తెరకెక్కించిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థపై నాగవంశీ నిర్మించారు. టీజర్, ట్రైలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా నేడు(నవంబర్24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.   వైష్ణవ్ తేజ్ కు ఈ సినిమా   హిట్టు పడలేదనే చెప్పాలి. కొత్త దర్శకుడు శ్రీకాంత్ మెప్పించలేదనే చెప్పాలి. 

'ఆదికేశవ' ఓటీటీ హక్కులను స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేటర్లలో తమ డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్నర్ అని 'ఆదికేశవ' చిత్ర టీమ్ పేర్కొంది. ఎగ్రిమెంట్ ప్రకారం థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలో సినిమాను విడుదల చేస్తారు.  క్రిస్మస్ లేదా న్యూ ఇయర్ సందర్భంగా సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.  

స్టోరీ లైన్

 బాలు (వైష్ణవ్ తేజ్)   సలక్షణమైన కుర్రాడు. సగటు యాక్షన్ సినిమా హీరోలాగ...అతనికి అన్యాయం,అక్రమం అంటే గిట్టదు. అవి చేసేవాళ్లను ఎంతదూరం వెళ్లైనా అంతు తేలుస్తూంటాడు. అతని అమ్మా,నాన్నా (రాధిక శరత్ కుమార్, జయప్రకాశ్) కొంతకాలం ఈ అన్యాయ,అక్రమాలను ఎదుర్కొనే జాబ్ కు గ్యాప్ ఇచ్చి ... ఏదన్నా  ఉద్యోగం చెయ్యమని బతిమాలుతూ వుంటారు. సర్లే పెద్దవాళ్లు అని, వాళ్ళ కోరిక కాదనలేక ఒక కాస్మొటిక్స్ కంపెనీ కి అప్లై చేసి,ఇంటర్వూలో  ఆ కంపెనీ సీఈవో చిత్ర (శ్రీ లీల)  ఇంప్రెస్ చేసిసే ఉద్యోగంలో చేరిపోతాడు. ఆ తర్వాత ఖాళీగా ఉండటం ఎందుకు..ఆమే హీరోయిన్ కదా అని గుర్తించినట్లున్న మన హీరో ఆమెతో ప్రేమలో పడతాడు. సర్లే మీరు ఇంత సినిమాటెక్ గా వెళ్తున్నారు కదా అని ఆమె తండ్రి కూడా అదే ఫాలో అవుతాడు. ఓ రోజున అదే కంపెనీ లోనే పనిచేస్తున్న ఇంకొక కుర్రాడికి ఇచ్చిన తన కూతురు చిత్రని ఇచ్చి పెళ్లి చేయాలని ఆయన ప్రకటన చేసేస్తాడు. అక్కడితో ఆగకుండా మన హీరోకు వార్నింగ్ ఇవ్వడానికి కొంతమంది రౌడీలను కూడా పిలిపిస్తాడు.

 ఇంత రొటీన్ రచ్చ జరుగుతున్నప్పుడు ఇంకో ట్విస్ట్ రివీల్ కావాలి కదా. అందుకు రంగం సిద్దమవుతుంది. రాయలసీమకు చెందిన ఎమ్మెల్యే మహా కాళేశ్వర్ రెడ్డి (సుమన్) అన్నయ్య (తనికెళ్ళ భరణి) వచ్చి బాలుని అత్యవసరంగా రాయలసీమ తీసుకొని వెళతాడు.  అక్కడ బ్రహ్మపురంలో చెంగారెడ్డి (జోజు జార్జి)   అక్రమంగా మైనింగ్ చేయిస్తూ పిల్లలచేత పనులు చేయిస్తూ ఉంటాడు. విలన్ కదా  అడ్డుకునేవాళ్ళందరినీ చంపేస్తూంటాడు. అక్కడికే మన హీరో వెళ్తాడు. ఇక్కడ  హైదరాబాదులో కాస్మొటిక్ కంపెనీలో పనిచేసే బాలుకి రాయలసీమనుంచి పిలుపు రావటం  ఏంటి , ఆ విలన్ తో మనడోకి ఏంటి లింక్ , బాలు  అసలు పేరు రుద్రా కాళేశ్వర్ రెడ్డి  అని తెలిసింది?  మన హీరో బాలు నేపధ్యం ఏంటి? ఇవన్నీ ఊహించలేకపోతే  'ఆదికేశవ' సినిమా చూడాల్సిందే. 

'ఆదికేశవ' చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్ నిర్మాణ సంస్థలపై సూర్యదేవర నాగ వంశీ, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి ఎస్. సాయి సౌజన్య నిర్మించారు. హీరో స్నేహితుడిగా సుదర్శన్ నటించారు. తల్లిదండ్రుల పాత్రల్లో రాధికా శరత్ కుమార్, జయప్రకాశ్ కనిపించారు. ప్రతినాయకుడిగా మలయాళ హీరో జోజు జార్జ్, ఇతర కీలక పాత్రల్లో సుమన్, తనికెళ్ళ భరణి, అపర్ణా దాస్, సుధా తదితరులు నటించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios