రామ్ - లింగు స్వామి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా నుంచి .. ఆది పినిశెట్టి బర్త్ డే సందర్భంగా  పోస్టర్ రిలీజ్ చేశారు టీమ్. ఈ సినిమాలో ఆది పవర్ ఫుల్ విలన్ గా కనిపించబోతున్నారు.  

రామ్ పోతినేని(Ram Pothineni) హీరోగా లింగుసామి డైరెక్షన్ లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీలక పాత్రలో ఆది పినిశెట్టి(Aadhi Pinisetty) నటిస్తున్నారు. రామ్ కు స్ట్రాంగ్ విలన్ గా ఆది కనిపించబోతున్నాడు. రామ్ కి ఇది 19వ సినిమా. ఈ మూవీలో ఆది పినిశెట్టి లుక్ ను ఆయన పుట్టిన రోజు (డిసెంబర్ 14) సందర్భంగా రిలీజ్ చేశారు మూవీ టీమ్. స్మార్ట్ విలన్ గా కొన్ని సినిమాల్లో కనిపించారు ఆది. ఈ సినిమాలో కూడా విలన్ గా స్టయిలీష్ గడ్డంతో హ్యాండ్ సమ్ లుక్ లోనే కనిపిస్తున్నారు ఆది.


ఆది పినిశెట్టి ‘సరైనోడు’, ‘రంగస్థలం’, ‘నిన్ను కోరి’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. స‌రైనోడు త‌ర్వాత మ‌ళ్లీ విల‌న్‌గా చేయాలంటే పాత్ర‌లో ఏదైనా ప్ర‌త్యేక‌త ఉండాలి. ఆ రేంజ్ పవర్ ఫుల్ క్యారెక్టర్ దొరికితే విలన్ గా చేస్తానని గతంలో చెప్పారు ఆది. రామ్ సినిమాలో అలాంటి పాత్ర దొరకడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లింగుసామి చెప్పిన కథ విన్నాక ఇది సాధారణ సినిమాల్లో విల‌న్ పాత్ర‌లా అనిపించకపోవడంతో.. వెంటనే సినిమా ఒప్పుకున్నానన్నారు ఆది. ఈ సినిమాలో ఆది క‌డ‌ప, క‌ర్నూల్‌కు చెందిన రా అండ్ ర‌స్టిక్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 

అటు ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఎన్నో అంచనాల మధ్య విడుదలైన రామ్ పోతినేని ‘రెడ్’ (Red)మూవీ ఈ యేడాది సంక్రాంతి కానుకగా రిలీజై నిరాశపరిచింది. దీంతో తమిళ దర్శకుడు లింగుసామి (Lingusamy) చెప్పిన కథ నచ్చడంతో రామ్ ఓకే చెప్పారు. లింగుసామి కూడా గతంలో అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేయాలి అనుకున్నారు. కాని అది వర్కౌట్ కాలేదు. ఇపుడు అదే స్టోరీని కొంచెం మార్పులు చేర్పలతో రామ్‌‌ని ఒప్పించినట్టు తెలుస్తోంది. రన్, పందేంకోడి, ఆవారా లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించిన లింగుసామి.. తెలుగులో మాస్ సినిమాలకు మంచి ఆదరణ ఉండటంతో తెలుగులో డైరెక్ట్ సినిమా చేస్తున్నారు. 

Also Read : Mahesh Babu: మహేష్ ఆకస్మిక ప్రయాణం.. ఫ్యాన్స్ లో ఆందోళన!


 కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈమూవీకి ఉస్తాద్ టైటిల్ ను దాదాపు ఫిక్స్ చేసినట్టే అని తెలుస్తోంది. ఇప్పటికే ఫిల్మ్ చాంబర్‌లో ‘ఉస్తాద్’ టైటిల్‌ కూడా రిజిస్టర్ చేసారు. టైటిల్ ను మూవీ టీమ్ అఫీషియల్ గా అనౌన్స్ చేయడమే తరువాయి. ఎస్ ఎస్ స్క్రీన్స్ బ్యానర్ లో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈమూవీకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.