రజినీకాంత్ ఫ్యాన్స్ చేసిన పనికి ఓ మహిళ అసహనానికి గురయ్యారు. ఆయన రజినీకాంత్ ని ఉద్దేశించి పరుష వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో వైరల్ అవుతుంది.
రజనీకాంత్ అతిపెద్ద ఫ్యాన్ బేస్ ఉన్న మాస్ హీరో. పండగలకు, పబ్బాలకు... ఆయన జన్మదినం నాడు ఇంటి ముందు భారీగా అభిమానులు చేరుతారు. రజినీకాంత్ కి శుభాకాంక్షలు చెప్పేందుకు వస్తారు. సంక్రాంతి పండగను పురస్కరించుకుని రజినీకాంత్ అభిమానులు ఆయన ఇంటి వద్దకు చేరారు. తలైవా అంటూ నినాదాలు చేశారు. రజినీకాంత్ బయటకు వచ్చి తన అభిమానులకు అభివాదం చేశారు. అభిమాన హీరోని చూసిన ఫ్యాన్స్ మరింత రెచ్చిపోయారు. నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తించారు.
అయితే ఇది స్థానికుల అసహనానికి కారణమైంది. ఓ మహిళ రజినీకాంత్ తో పాటు ఆయన అభిమానులను ఉద్దేశించి పరుష వ్యాఖ్యలు చేసింది. అంత ప్రేమ ఉంటే అభిమానులను రజినీకాంత్ ఇంట్లోకి పిలిపించుకోవాలి. పండగ పూట ప్రశాంతత లేకుండా ఈ గోల ఏంటి... అంటూ ఆ మహిళ మండిపడింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
ఈ వివాదంలో రజినీకాంత్ తప్పు లేకపోయినా ఫ్యాన్స్ అత్యుత్సాహం కారణంగా ఆయన విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరోవైపు రజినీకాంత్ గత ఏడాది జైలర్ రూపంలో భారీ విజయం నమోదు చేశాడు. నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆయన ఎక్స్టెండెడ్ గెస్ట్ రోల్ చేసిన లాల్ సలామ్ సంక్రాంతి కానుకగా విడుదలైంది.
ప్రస్తుతం రజినీకాంత్ వెట్టైయాన్ టైటిల్ తో ఒక చిత్రం చేస్తున్నారు. టీజీ జ్ఞానవేల్ ఈ చిత్ర దర్శకుడు. అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ వంటి స్టార్ క్యాస్ట్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.
